బాయ్ ఫ్రెండ్ చేసిన పనికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. నటి వ్యాఖ్యలు!

హిందీ బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్, భోజ్ పురి ఫేమ్ అక్షర సింగ్ ఈ మధ్యనే ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి వలన నరకం చూశానని చెప్పుకొచ్చింది. తనపై యాసిడ్ దాడి చేయించేందుకు అతడు కుట్ర చేశాడని.. కెరీర్ నాశనం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించాడని చెబుతూ ఎమోషనల్ అయింది.

ఒకరోజు రోడ్డుపై ఒంటరిగా వెళ్తుండగా.. కొందరు యాసిడ్ బాటిల్స్ తో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని.. వీధుల్లో డ్రగ్స్ తీసుకునేవారిని తనపై దాడి చేయడానికి తన మాజీ బాయ్ ఫ్రెండ్ నియమించాడని చెప్పింది. అంతేకాదు.. తన కెరీర్ నాశనం చేస్తానని.. తనను ప్రాణాలతో వదిలిపెట్టమని తరచూ బెదిరించేవాడని చెప్పింది. ఆ దెబ్బకి డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. కానీ తన తండ్రి మాటలు కొత్త ధైర్యాన్ని నింపాయని.. మానసికంగా స్ట్రాంగ్ అయ్యానని తెలిపింది.

అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని.. తన జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులు ఏ అమ్మాయికి ఎదురవకూడదని.. ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus