Actress: నటి మరణానికి ప్లాస్టిక్ సర్జరీ యే కరణమా?

గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ గా కనిపించాలని నటీ నటులు పలు అవయవాలకు ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ హీరో హరోయిన్లు అనేక మంది సర్జరీలు చేయించుకున్నవారే. కానీ ఇవి కొన్నిసార్లు వికటించి.. ప్రాణం మీదకు తెచ్చిన ఘటనలు ఎన్నో. దివంగత నటి శ్రీదేవి లిప్ సర్జరీ చేయించుకోగా.. మూతి వాచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కన్నడ నటి చేతన రాజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోగా.. వికటించి ప్రాణం పొగొట్టుకుంది. మొన్నటికి మొన్న బిటీఎస్ గాయకుడు జిమిన్‌లా కనిపించేందుకు 12 ఆపరేషన్లు చేయించుకున్న కెనడీయన్ నటుడు శాండ్ వాన్ మృతి చెందాడు.

తాజాగా మరో నటి చిన్న వయస్సులో అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. అయితే దీనికి కూడా సర్జరీలే కారణమని తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు తనను తాను మార్చుకున్న మోడల్ క్రిస్టినా ఆష్టన్ గోర్కానీ గుండెపోటుతో మరణించింది. ఈ నెల 20న ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, ఆమె ప్లాస్టిక్ సర్జరీ కారణంగానే చనిపోయినట్లు పేర్కొన్నారు. కిమ్ కర్దాషియన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ ప్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆమెలా కనిపించాలన్న చాలా మంది నటీమణులు.. సర్జరీలు చేయించుకుంటుంటారు.

మోడల్ క్రిస్టినాకు కూడా అదే కోరిక ఉండేది. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయడం ద్వారా కిమ్ వంటి ఆకృతిని, ముఖాన్ని పొందింది. శస్త్రచికిత్స తర్వాత, ఆమె సరిగ్గా కిమ్ లాగా కనిపించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కిమ్‌లా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న తర్వాత, ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కిమ్ కర్దాషియాన్ లాగా అందంగా కనిపించేందుకు క్రిస్టినా రూ.11.12 కోట్లు వెచ్చించి కాస్మెటిక్ సర్జరీ జరిగింది.

అప్పటి నుంచి (Actress) ఆమెకు అనేక వైద్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. కొద్దిరోజుల తర్వాత కిమ్ కర్దాషియాన్‌లా కనిపించిన మృతి చెందడం ఆమె అభిమానులను కూడా కలిచివేసింది. అయితే ఏ ఆపరేషన్ కారణంగా ఆమె చనిపోయిందే తెలియరాలేదు. కానీ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా గుండె పోటుకు గురై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు కిమ్ కర్దాషియాన్ రిప్ అంటూ కామెంట్స్ పెట్టారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus