Actress: బాయ్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేయలేదు.. పార్టీలకు తిరగలేదు : స్టార్ హీరోయిన్ .!

  • June 3, 2023 / 01:53 PM IST

ఈరోజు సినిమాల్లో రాణించే ప్రతి ఒక్కరికీ ఓ బ్యాక్ స్టోరీ కచ్చితంగా ఉంటుంది. ఒక్కరోజులోనే స్టార్లు అయిపోయిన వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ కొద్దిలో కొద్దిగా అయినా రాణిస్తున్నారు అంటే దానికి చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. సరిగ్గా హీరోయిన్ నోరా ఫతేహికి కూడా ఉందట. ఈమె తెలుగు హిందీ, ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట ఐటెం సాంగ్స్ లో నర్తించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది.

‘ధృవ’, ‘మిస్టర్ మజ్ను’.. వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయిన (Actress) ఈమె.. ఇప్పుడు బాలీవుడ్లో పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో అలాగే పలు సినిమాల్లో నటిస్తోంది. ఈమె ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడిందట. కెరీర్ ప్రారంభంలో హుక్కా బార్ లో కూడా పనిచేసిందట. దాంతో పాటు ఇంకా ఎన్నో పనులు చేసే దాన్ని అని తెలిపింది. ఆడపిల్ల అయినప్పటికీ చెప్పు దెబ్బలు కూడా భరించిందట.. “మొరాకో దేశానికి చెందిన నేను.. చిన్నప్పటి నుండి మంచి డాన్సర్ అనిపించుకోవాలని కలలు కన్నాను.

అందుకు నా తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. బుద్ధిగా చదువుకోమని నచ్చజెప్పారు. అయినా కూడా నాకు డ్యాన్స్ చేయడానికి ఆసక్తి ఎక్కువ.కాబట్టి నా తల్లికి తెలియకుండా డ్యాన్స్ నేర్చుకునేదాన్ని. ఓసారి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నా తల్లికి పట్టు పడి చెప్పు దెబ్బలు కూడా తిన్నాను. అందరి ఆడపిల్లల్లా నేను అన్ని సంతోషాలు అనుభవించలేదు. బాయ్ ఫ్రెండ్ ను మెయింటైన్ చేయలేదు. సోదరుడి పెళ్ళికి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది” అంటూ నోరా ఫతేహి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus