బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లిలో పెద్ద గొడవ జరిగిందట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. 2021, డిసెంబర్ 9న కత్రినా, విక్కీల వివాహం జరిగింది. ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న తమ పెళ్లిలో పెద్ద గొడవ జరిగిందని.. కుర్చీలు, చెప్పులు విసుకునేంత రేంజ్ లో అయిందని చెప్పుకొచ్చింది. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన విక్కీ, కత్రినా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సెలబ్రిటీలతో పాటు బంధువులు, అతిథులు హాజరయ్యారు.
సంతోషంగా జరుగుతున్న పెళ్లిలో ఒక్కసారిగా అలజడి రేగిందని.. కత్రినా ఆరోజు ఘటనను గుర్తుచేసుకుంది. పెళ్లిపీటలపై కూర్చున్న సమయంలో సడెన్ గా పెద్ద శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగి చూసిందట కత్రినా. అక్కడ తన సిస్టర్స్, విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారట. ఏ రేంజ్ లో గొడవ పడ్డారంటే.. చివరికి కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై మరొకరు విసురుకొని మరీ తిట్టుకున్నారట. ఆ పరిస్థితుల్లో అక్కడకు వెళ్లలేకపోయానని.. ఆ తరువాత గొడవలో ఎవరు గెలిచారో అడగడం మర్చిపోయానని నవ్వుతూ చెప్పింది కత్రినా.
పెళ్లి తరువాత సినిమాల పరంగా కత్రినా, విక్కీ ఇద్దరూ బిజీ అయ్యారు. కాస్త గ్యాప్ దొరికితే ట్రిప్స్ కి చెక్కేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘ఫోన్ భూత్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కత్రినా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మేరీ క్రిస్మస్’, ‘టైగర్3’ సినిమాలు ఉన్నాయి. మరోపక్క విక్కీ కౌషన్ ‘సామ్ బహదూర్’, ‘గోవిందా నామ్ మేరా’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!