బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో బుల్లితెరపై సక్సెస్ సాధించగా ప్రస్తుతం ఓటీటీలో కూడా బిగ్ బాస్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో బిగ్ బాస్ షో ఓటీటీ సీజన్2 ప్రసారం కానుండగా ఈ షోలో పూజా భట్ పాల్గొన్నారు. ఈ షోలో ప్రముఖ నటి, డైరెక్టర్ పూజా భట్ పాల్గొనగా ఆమె ఈ షోలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూజా భట్ తన చెడు అలవాట్ల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. 44 సంవత్సరాల వయస్సులో పూజా భట్ మద్యపానం అలవాటుకు దూరం కావడం జరిగింది. నాకు మద్యం తాగే అలవాటు ఉందని ఆ అలవాటు వ్యసనంగా మారిందని పూజా భట్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మద్యం అలవాటుకు దూరంగా ఉండాలని భావించానని ఆమె కామెంట్లు చేశారు. ఈ సమాజంలో మగవాళ్లు ఏదైనా చేయొచ్చు అనే విధంగా వాళ్లకు లైసెన్స్ ఉంటుందని పూజా భట్ చెప్పుకొచ్చారు.
సమాజం వాళ్లు చెప్పేది వింటుందని ఆడవాళ్ల మాటలు మాత్రం వినాలని అనుకోవట్లేదని పూజా భట్ పేర్కొన్నారు. మద్యానికి బానిసైన మగవాళ్లు ఆ అలవాటుకు దూరమైతే చప్పట్లు కొడతామని ఆమె చెప్పుకొచ్చారు. ఆడవాళ్ల పరిస్థితి మరోలా ఉంటుందని ఆమె కామెంట్లు చేశారు. ఆడవాళ్లు తాము తాగుతామని బహిరంగంగా చెప్పుకోరని పూజాభట్ అన్నారు.
అలాంటప్పుడు ఆ అలవాటును వదిలేశామని మహిళలు ఎలా చెబుతారని (Actress) పూజా భట్ అన్నారు. నేను అందరి ముందు మందు తాగేదానినని ఆ అలవాటును మానేస్తే అందరి ముందు ఎందుకు చెప్పకూడదని ఆమె పేర్కొన్నారు. నన్ను అప్పటికే తాగుబోతు అని పిలిచేవారని పూజాభట్ కామెంట్లు చేశారు. జియో సినిమాస్ లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 హిందీ ప్రసారమవుతోంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్