Actress: రిజెక్ట్ చేసిన సినిమాని భర్త ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చింది.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఓ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ నిర్వహిస్తున్న సమయంలో.. ఆ సినిమా కథకి సంబంధించిన పలు పాత్రల కోసం ఎంతో మంది నటీనటులను సంప్రదిస్తూ ఉంటారు మేకర్స్. అప్పుడు ఆ పాత్రలకి నటీనటులు ఓకే చెబుతారు అనే గ్యారంటీ ఉండదు. చాలా మందికి ఇది తెలిసే ఉండొచ్చు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ‘సుఖీ’ అనే చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమాలో నటించడం మొదటి నుండి ఆమెకు ఇష్టం లేదట. అయినా భర్త ఒత్తిడి మేరకు నటించినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘సుఖీ’ అనే సినిమా సెప్టెంబర్ 22న విడుదల కాబోతుంది. ఈ మధ్యనే మేకర్స్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. ట్రైలర్ లాంచ్ వేడుకలో నటి శిల్పాశెట్టి మాట్లాడుతూ.. ‘నా మానసిక పరిస్థితి సరిగ్గా లేని టైంలో ఈ సినిమా కథ విన్నాను. ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ లేక రిజెక్ట్ చేశాను. నాకు బదులు వేరే వాళ్ళని తీసుకోవాలని మేకర్స్ కి చెప్పాను. కొంతమంది నటీమణుల పేర్లు కూడా రిఫర్ చేశాను.

అయినా సరే మేకర్స్ వదిలిపెట్టలేదు. కొంచెం టైం తీసుకుని.. ఆలోచించుకుని చెప్పమని.. 8 నెలల పాటు నాకోసం ఎదురు చూశారు. ఓ రోజు నేను ఇంట్లో లేని టైంలో రాజ్(శిల్పా భర్త) స్క్రిప్ట్ చదివి ‘స్టోరీ బాగుంది. ఎలాగైనా నువ్వు ఈ సినిమా చేయాలి’ అని అన్నాడు. నేను వివిధ కారణాలు చెప్పి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నించినప్పటికీ ‘నీకు పిచ్చా? మంచి స్టోరీని మిస్ చేసుకోకూడదు ఎలాగైనా చేయాలి’ అంటూ బలవంతం చేశాడు. ప్రతి పురుషుడు ఆయనలా ఆలోచించగలిగితే అద్భుతంగా ఉంటుంది’ అంటూ ఆమె (Actress) చెప్పుకొచ్చింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus