బాలీవుడ్ మాఫియాని వదలొద్దు అంటూ, లాయర్లను కూడా ఏకి పారేసిన హీరోయిన్..!

తనుశ్రీ దత్తా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆషిక్ బనాయా పాట అంటే ఠక్కున గుర్తొచ్చేది ఈమెనే.ఒకప్పుడు తన గ్లామర్ తో బీ టౌన్ ను ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. ఈమె చాలా శృంగార సన్నివేశాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్లో కూడా బాలకృష్ణ ‘వీరభద్ర’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అవ్వకపోవడం వలన ఆమె మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

అయితే 2018లో మీటూ ఉద్యమాన్ని నెలకొల్పి దానిని పీక్స్ కు తీసుకెళ్లింది ఈమెనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2008లో వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా కోసం ఓ పాట షూటింగ్‌ టైంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు వ్యక్తం చేసింది.అంతేకాదు అటు తర్వాత లైంగికంగా ఆమె పై దాడి కూడా చేసి ఏడిపించాడని ఇండస్ట్రీలో చాలా మంది నటీమణుల పరిస్థితి ఇలానే ఉందని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ తర్వాత ‘మీటూ’ ఉద్యమం ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ నానా పటేకర్ తనుశ్రీ ఆరోపణలను కొట్టిపారేశాడు. అయినప్పటికీ అతన్ని పలు సినిమాల నుండి తీసివేయడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో.. “నాకు ఏదైనా జరిగితే #metoo నిందితుడు నానా పటేకర్, అతని లాయర్లు, సహచరులు, అతని వెనకున్న బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్స్ బాధ్యులని చెప్పండి! బాలీవుడ్ మాఫియా ఎవరంటే.. సుశాంత్ సింగ్ మరణ కేసులో తరచుగా వినిపించిన పేరు ఆ క్రిమినల్ లాయర్ దే.

నాకు ఏదైనా జరిగితే దానికి కారణం నానా పటేకర్, అతని లీగల్ టీం, బాలీవుడ్ మాఫియా. ఇక నుండి వాళ్ళ సినిమాలు చూడకండి. నా గురించి అసత్య ప్రచారాలు చేసిన పాపులర్ ముఖాలు, జర్నలిస్టుల వెంటపడండి. ఇలాంటి దుష్ప్రచారాల వెనుక వారి PR లు కూడా ఉన్నారు. ఎవరిని వదలకండి! నన్ను చాలా వేధించినందుకు వారి జీవితాలను నరకయాతన చేయాలని, చట్టం, న్యాయం నాకు లభించకపోవచ్చు. కానీ.. దేశ ప్రజల పై నాకు నమ్మకం ఉంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus