ప్రభాస్ టీంను ఇబ్బంది పెడుతున్న స్టార్ హీరోయిన్..!

ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న ‘రాధే శ్యామ్’ టైటిల్ నే ఖరారు చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు. ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు.

బాలీవుడ్ లో కూడా ఈ ఫస్ట్ లుక్ తో ఏమాత్రం బజ్ ఏర్పడలేదు. దీంతో ‘రాధే శ్యామ్’ ను పక్కన పెట్టి.. ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చెయ్యబోతున్న చిత్రం పైనే అంతా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ అదిరిపోయిందని ఇన్సైడ్ టాక్. అందుకే ప్రభాస్ కూడా సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పేశాడు. నిర్మాత అశ్వినీ దత్ కూడా ఈ ప్రాజెక్ట్ ను రిచ్ గా రూపొందించాలని డిసైడ్ అయ్యారు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం వీళ్ళు సందేహ పడుతున్నట్టు సమాచారం.

Star actress shocks Prabhas 20 movie team1

ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం దీపికా పడుకొనే ను అనుకున్నారు. కానీ ఆమె 15కోట్లు పారితోషికం అడగడంతో కియారాను అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించారట. కానీ నాగ్ అశ్విన్ మనసులో దీపికా పడుకొనే అయితేనే బెటర్ అని ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఆమె మాత్రం 15 కోట్లకు రూపాయి కూడా తగ్గనని పట్టుబట్టి కూర్చుందట. ప్రభాస్ సినిమా అయినప్పటికీ ఆమె తగ్గడం లేదనేది ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus