Star Actress: 8 ఏళ్ళ కూతురు ఉంది.. ఈ వయసులో హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తారా..?
- August 27, 2024 / 10:07 AM ISTByFilmy Focus
శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar) అందరికీ సుపరిచితమే. సీనియర్ నటుడు విజయ్ కుమార్ (Vijayakumar) కూతురు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘రుక్మిణి’ (Preetha Vijayakumar) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె కొన్నాళ్ల తర్వాత ప్రభాస్ (Prabhas) కి జోడీగా ‘ఈశ్వర్’ (Eeswar) సినిమాలో నటించింది. ప్రభాస్ తో పాటు శ్రీదేవికి కూడా ‘ఈశ్వర్’ డెబ్యూ మూవీ. ఆ తర్వాత తరుణ్ తో ‘నిన్నే ఇష్టపడ్డాను’ , ఆర్యన్ రాజేష్ తో ‘నిరీక్షణ’ వంటి సినిమాల్లో ఈమె (Star Actress) నటించింది.
Star Actress

కానీ ఎందుకో ఈమె గ్లామర్ కి, నటనకి తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేయలేదు. దీంతో ఇక్కడ ఎక్కువ ఆఫర్లు సంపాదించలేకపోయింది శ్రీదేవి. రవితేజకి (Ravi Teja) చెల్లెలుగా ‘వీర’ (Veera) సినిమాలో నటించినా.. అది కూడా ఈమెకు కలిసిరాలేదు. దీంతో 2009లో రాహుల్ అనే బిజినెస్మెన్ ని పెళ్లి చేసుకొని హైదరాబాద్లోనే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం శ్రీదేవి వయసు 37 ఏళ్లు. ఈమెకు 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ వయసులో కూడా ఈమె హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

సాధారణంగా 37 ఏళ్ల వయసులో హీరోయిన్ ఛాన్స్ రావడం చాలా కష్టం. అయినా సరే శ్రీదేవికి వచ్చింది. నారా రోహిత్ (Nara Rohith) హీరోగా తెరకెక్కిన ‘సుందరకాండ’ లో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. అందులో అతనికి చాలా వయసొచ్చినా పెళ్లి కాదు. ముదురు బ్రహ్మచారి పాత్ర కాబట్టి.. శ్రీదేవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఈ సినిమాతో అయినా ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి.












