నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయనే నమ్మకాన్ని కూడా కలిగించింది. ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ‘దసరా’ (Dasara), హాయ్ నాన్న (Hi Nanna) వంటి హిట్లతో ఫుల్ ఫామ్లో ఉన్న నాని.. ‘సరిపోదా శనివారం’ తో హ్యాట్రిక్ కొడతాడని అభిమానులు భావిస్తున్నారు.
Saripodhaa Sanivaaram
ఈ మధ్యనే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. రన్ టైం 2 గంటల 46 నిమిషాల వరకు వచ్చినట్టు టీం తెలిపింది. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంది కాబట్టి యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది చిత్ర బృందం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ ఎక్కువ హైలెట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట.
అంటే హీరో నాని కంటే ఎస్.జె.సూర్య (SJ Suryah) రోల్ చాలా ఇంపాక్ట్-ఫుల్ గా ఉండబోతుంది కావచ్చు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడట ఎస్.జె.సూర్య. హీరో పాత్ర ప్రకారం అతను ఎక్కువగా సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుందట. దీంతో ఎస్.జె.సూర్య చెలరేగిపోయాడు అని.. అతని విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. అయితే విలనిజం..
మరీ హీరోయిజాన్ని డామినేట్ చేసేలా ఉంటే తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో వచ్చిన ‘స్పైడర్’ (Spyder) లో కూడా ఎస్.జె.సూర్య రోల్ మహేష్ (Mahesh Babu) .. పాత్రనే డామినేట్ చేసేసింది. అది తెలుగు ప్రేక్షకులకి రుచించలేదు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.