Jr NTR: ఎన్టీఆర్‌ – హృతిక్‌ సినిమాలో హీరోయిన్‌గా ఆమె ఫిక్స్‌ అట.. ఈ సారైనా!

  • April 10, 2023 / 06:51 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అయిపోయాక.. ఆలియా భట్‌ మన తారక్‌ పక్కన నటిస్తే బాగుండు అని అనుకున్నారు ఫ్యాన్స్‌ అంతా. అనుకున్నట్లుగా ఓ సినిమా ఆల్‌మోస్ట్‌ ఫిక్స్‌ అయ్యింది కూడా. అయితే అనుకోని పరిస్థితుల నేపథ్యంలో అంతా మారిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ అంతా ఓకే అని అంటున్నారు. అవును తారక్‌ కొత్త సినిమా అంటూ ప్రచారంలో ఉన్న ‘వార్‌ 2’ సినిమాలో ఆలియా భట్‌ నటిస్తోందని బాలీవుడ్‌ సమాచారం. తారక్‌ బాలీవుడ్‌ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా వస్తున్న పుకార్ల షికార్లకు తెరదించుతూ ‘వార్‌ 2’కి సంబంధించి అన్‌ అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది.

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్‌ అనలిస్ట్‌ కమ్‌ రిపోర్టర్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ హుషారు మామూలుగా లేదు. అయితే ఇప్పుడు దానిని డబుల్‌ చేస్తూ ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించేది ఆలియా భట్‌ అని అంటున్నారు. ఆలియా భట్‌ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇదివరకు ఓకే చేసిన సినిమాలు తప్ప కొత్తగా ఏవీ ఒప్పుకోలేదు.

అయితే ‘వార్‌ 2’ సినిమా విషయంలో ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది. ‘వార్‌ 2’ కథానాయికగా అలియా భట్‌ దాదాపు ఓకే అని అంటున్నారు. త్వరలోనే సినిమాను ముగ్గురు ఫొటోలతో భారీగా అనౌన్స్‌ చేస్తారని చెబుతున్నారు. దీని కోసం ఓ భారీ ఈవెంట్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారట. ముంబయిలో దీన్ని నిర్వహిస్తారని అంటున్నారు. తారక్‌ – కొరటాల సినిమాలో తొలుత ఆలియానే అనుకున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా లేట్‌ అవ్వడం, ఈలోపు ఆలియా గర్భవతి కావడంతో సినిమా నుండి పక్కకు తప్పుకుంది. అయితే తారక్‌ (Jr NTR) నటించడానికి తాను ఎప్పుడూ రెడీనే అని చెప్పింది. ఇప్పుడు ‘వార్‌ 2’లో ఆమె నటిస్తోంది అంటున్నారు. ఇది నిజమైతే చాలా ఆనందం అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus