రామ్ చరణ్ – శంకర్ సినిమా కోసం స్టెప్పులేయిస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ ఎవరంటే..?

  • February 16, 2023 / 05:49 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా.. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ RC 15 ప్రస్తుతం విశాఖపట్నంలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది..

ఇది చరణ్ 15వ సినిమా కాగా దిల్ రాజుకి 50వ సినిమా.. హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఖర్చు పెరుగుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నారు. ఫైట్స్, సాంగ్స్, వాటి సెట్స్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారట. ఇప్పటికే డిజిటల్, డబ్బింగ్ రైట్స్ ద్వారానే పెట్టుబడి వచ్చేసిందని కూడా అంటున్నారు. ఇప్పటికే కొంత భాగం విదేశాల్లో షూట్ చేశారు. ఈమధ్యే హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ చిత్రీకరణ జరిపారు. శంకర్ శిష్యుడు, కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ ఇస్తున్నారు..

శంకర్ సినిమా అంటే సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఒక్క పాటలో ప్రపంచంలోని ఏడు వింతల్ని చూపించడం అనేది ఆయనకే చెల్లింది.. కోట్లాది రూపాయలతో సెట్స్ వేయించి.. విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు.. ఈ మూవీ కోసం కూడా అదిరిపోయే రేంజ్‌లో పాటల్ని ప్లాన్ చేస్తున్నారు. ఆర్ట్ వర్క్ గురించి చెప్పక్కర్లేదు.. ఇక ఒక్కో పాటకి ఒక్కో టాప్ కొరియోగ్రాఫర్ చరణ్ చేత సాలిడ్ స్టెప్పులేయించనున్నారు..

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, పాపులర్ బాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ గణేష్ ఆచార్య, బాస్కో మార్టిస్, టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో జానీ మాస్టర్, ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ సాంగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వంటి టాప్ కొరియోగ్రాఫర్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. పెద్ద క్యారెక్టర్ రాజకీయ నాయకుడిగా.. చిన్న చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గానూ కనిపించనున్నాడని అంటున్నారు.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus