సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలల్లోకి అడుగుపెట్టలేనని చెప్పి.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. మరికొంత మంది అయితే ఆయన సినిమాల నుండీ కూడా తప్పుకుంటాడని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో `అన్నాత్తే` చిత్రంతో పాటు ఆయన కమిట్ అయిన మరో రెండు సినిమాలను చేసి కొన్నాళ్ల పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇవ్వాలని రజినీ భావిస్తున్నట్టు చెన్నై మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ‘అన్నాత్తే’ చిత్రం నవంబర్ 4న విడుదల కాబోతున్నట్టు నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ వారు ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. రజనీ పై ఓ ప్లాప్ డైరెక్టర్ బాగా ఆశలు పెట్టుకుంటున్నాడు.ఆయన మరెవరో కాదు కె.యస్.రవికుమార్. వివరాల్లోకి వెళితే.. గతంలో కె.ఎస్.రవి కుమార్ – రజనీ కాంబోలో `రానా` పేరుతో ఓ పిరియాడికల్ మూవీ రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. అయితే ఈ మూవీని తిరిగి ప్రారంభించబోతున్నట్టు… దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ కొత్త మూవీ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కెఎస్ రవి కుమార్..
రజనీతో సన్నిహితంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ.. ‘నేను రజనీ సార్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటున్నాను. 6 నెలల క్రితం నేను `రానా` స్క్రిప్ట్‌ను ఆయనకు మళ్ళీ వినిపించాను. ఆయనకు అది బాగా నచ్చింది. రజనీ సార్ కోలుకున్న వెంటనే ఈ ప్రాజెక్టు ఉంటుంది. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు కె.యస్.రవికుమార్.