ఒకప్పుడు కల్ట్ డైరెక్టర్.. ఇప్పుడేమో..!

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల్లో ‘మనసంతా నువ్వే’ ఒకటి. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో తీసిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిర్మాత ఎమ్మెస్ రాజు బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించి భారీ లాభాలను పొందారు. ఆర్ఫీ పట్నాయక్ సంగీతం సినిమాకి మరో హైలైట్. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి క్లాసిక్ సినిమాను తీశారు విఎన్ ఆదిత్య. డెబ్యూ సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు ఈ దర్శకుడు.

అప్పట్లో ఈ సినిమా సక్సెస్ గురించి అందరూ మాట్లాడుకునేవారు. ఈ సినిమా చూసిన నాగార్జున.. విఎన్ ఆదిత్యను పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనున్నాను’ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో నాగార్జున మళ్లీ వి.ఎన్.ఆదిత్యకు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ‘బాస్’ అనే సినిమా తీశారాయన. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. సిద్ధార్థ్ తో ‘ఆట’ అనే సినిమా చేశారు. ఈ సినిమా తరువాత వి.ఎన్.ఆదిత్య పూర్తిగా ఫామ్ కోల్పోయారు.

పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ రీసెంట్ గా ‘వాళ్లిద్దరి మధ్య’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సాధ్యం కాకపోవడంతో ఓటీటీకి ఇచ్చేశారు. ఈ సినిమా మెయిన్ థీమ్ బాగానే ఉన్నప్పటికీ.. ఎంగేజింగ్ గా సినిమా తీయలేకపోయారు. ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య ఈగో సమస్యలను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ఆదిత్య సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు.

కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోవడం.. పైగా పరిచయం లేని నటీనటులతో సినిమా తీయడం మైనస్ అయింది. ఈ సినిమా వి.ఎన్.ఆదిత్యకు సరైన కమ్ బ్యాక్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రైటింగ్ టీమ్ లో పని చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus