Pawan Kalyan: పవన్‌ పుట్టిన రోజు నాడు ఈ గుచ్చుడు ఎందుకు బాస్‌!

విజయ్‌ దేవరకొండ అభిమానులు ‘లైగర్‌’ని ఎలా మరచిపోదాం అనుకుంటారో.. పవన్ కల్యాణ్‌ అభిమానులు ‘అజ్ఞాతవాసి’ సినిమాను అలా మరచిపోదాం అనుకుంటారు. ఆ సినిమాకు వచ్చిన హైప్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో దేనికీ రాలేదు. కానీ సినిమా దారుణమైన ఫలితం పొందింది. ఈ సినిమా ‘లార్గో వించ్‌’ అనే ఫ్రెంచ్‌ యాక్షన్‌ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని చిత్రీకరించారని అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. సరిగ్గా ఆసమయంలోనే ‘లార్గో వించ్‌’ దర్శకుడు ట్వీట్లతో పవన్‌ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడు. ఇప్పుడు మరోసారి ఆయన అదే పని చేశాడు.

పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ‘జల్సా’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పారిస్‌లో కూడా ఓ షో వేస్తున్నారట. రెండో తేదీ సినిమా పడుతుంది అంటూ ఓ పోస్టర్‌ను ఓ పవన్‌ ఫ్యాన్‌ ట్వీట్‌ చేస్తే.. దాన్ని ‘లార్గో వించ్‌’ డైరక్టర్‌ జెరోమ్‌ సల్లే రీట్వీట్‌ చేశారు. అక్కడితో ఆగకుండా ‘పవన్‌ కోసం ఏదైనా బహుమతి కావాలా? ఏదైనా స్క్రిప్ట్‌ లాంటిది’ అంటూ రాసుకొచ్చారు. #PowerStarBirthday @Pawankalyan అనే హ్యాష్‌ట్యాగ్‌, ప్రొఫైల్‌ ట్యాగ్‌ కూడా చేశారు.

దీంతో పవన్‌ అభిమానులు జెరోమ్‌ మీద గుర్రుగా ఉన్నారు. శుభాకాంక్షలు చెబితే చెప్పాలి, లేదంటే ఊరుకోవాలి. అంతేకానీ ఇలా గుచ్చుడు ఎందుకు అని అంటున్నారు. ఆయన ట్వీట్‌ కింద కామెంట్లు చూస్తే ఇలాంటి మాటలే కనిపిస్తున్నాయి. ఇక యాంటీ పవన్‌ ఫ్యాన్స్‌ అయితే రచ్చ రచ్చ చేస్తున్నారు. అప్పట్లో దర్శకుడు త్రివిక్రమ్‌ చేసిన పనికి ఇప్పటికీ మేం జెరోమ్‌తో మాటలు పడాల్సి వస్తోంది అని అంటున్నారు. నిజానికి అలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ జెరోమ్‌ మాత్రం ‘అజ్ఞాతవాసి’ని బాగా పట్టేశారు.

ఇలా ట్వీట్లు చేసే బదులు ‘అజ్ఞాతవాసి’ ప్రింట్‌ ఉంది.. అది పట్టుకుపో అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు ఈ గుచ్చుడు అని అనేవాళ్లూ ఉన్నారు. ఎంతమరచిపోదాం అన్నా ఇలా గుర్తు చేస్తున్నారు ఏంటో అంటూ కొన్ని కామెంట్స్‌ కనిపిస్తున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus