‘అర్జున్ రెడ్డి’ టైం నుండి బోల్డ్ కంటెంట్ కు డిమాండ్ పెరిగింది అని అంతా అంటుంటారు. కానీ అంతకు ముందు కూడా అలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చేవి. బోల్డ్ అంటే చాలా వరకు శృంగా* సన్నివేశారు, లిప్ లాక్ సన్నివేశాలు, బూతులు తిట్టడాలు అని అంతా అనుకుంటారు. కానీ కాదు. బోల్డ్ అంటే జీర్ణించుకోలేని విషయాలను పచ్చిగా తెలియజేయడం. వాటికి ఈ స్పైస్ యాడ్ చేస్తే కలిసొస్తుంది అనేది కొందరు దర్శకనిర్మాతల ఆలోచన కావచ్చు. జనాల్లో కూడా చాలా వరకు ఇదే అభిప్రాయం ఉంది.
సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. ! ఓ డైరెక్టర్ కి హీరోయిన్ ఘాటు లిప్ లాక్ ఇచ్చింది. ఇది సినిమాలో భాగమే లెండి. ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రలో ‘బొమ్మై’ అనే సినిమా రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కినట్టు స్పష్టమవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరనుండి ట్రైలర్ ఇలాంటి బోల్డ్ కంటెంట్ చాలా చోట్ల కనిపించింది. ఈ ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలకి సంబంధించిన స్క్రీన్ షాట్లని నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ట్రైలర్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రియా భవాని శంకర్,చాందినీ తమిళరసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ మొత్తంలో ప్రియా భవాని శంకర్ .. (SJ Suryah) ఎస్.జె.సూర్య ల మధ్య ఉన్న లిప్ లాక్ సన్నివేశం హైలెట్ అయ్యింది. ప్రియా భవాని శంకర్.. ఇంతకు ముందు ఇలాంటి సన్నివేశాల్లో నటించిన సందర్భాలు ఎక్కువగా లేవు. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :