టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాల్లో చాలానే రీమేక్ సినిమాలు ఉండగా వాటిలో కూడా ప్లాప్ చిత్రాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఓ దశాబ్ద కాలం కితం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన చిత్రం “తీన్ మార్” కూడా ఒకటి. దర్శకుడు జయంత్ సి పరాన్జీ అయితే తెరకెక్కించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నా అప్పట్లో మాత్రం పలు కారణాల చేత భారీ ప్లాప్ గా నిలిచిపోయింది. తీన్‌మార్’ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు.
అయినా భారీ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. కానీ ఇప్పటికీ ఈ సినిమాను ఇష్టపడే అభిమానులు ఉన్నారు. అయితే ఈ రొమాంటిక్ డ్రామా ఫ్లాప్ కావడంపై ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించలేనన్న జయంత్.. తన అభిప్రాయాలను మాత్రం పంచుకున్నారు. హీరోయిన్ మరొకరిని (సోనూ సూద్) పెళ్లి చేసుకుని, మళ్లీ హీరో కోసం తిరిగి రావడం పట్ల కొంతమంది అభిమానులు అసంతృప్తి చెందారని ఆయన పేర్కొన్నారు. అయితే, అభిమానులు మాటలు విని తాను షాక్ అయ్యానని కూడా జయంత్ అన్నారు.
అభిమానులు ఇలా ఆలోచిస్తారని అనుకోలేదని.. దీన్ని బట్టి పవన్ ఇమేజే సినిమాకు ప్రతిబంధకంగా మారిందని అర్థమైనట్లు జయంత్ తెలిపాడు. పవన్ ఎంతో నచ్చి చేసిన సినిమా ఇదని ఆయనన్నాడు. ఐతే ఆయన బదులు తరుణ్ లేదా సిద్దార్థ్ లాంటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో ఈ సినిమా చేస్తే మంచి ఫలితం వచ్చేదేమో అని (Director) జయంత్ అభిప్రాయపడ్డాడు. తీన్‌మార్ ఫెయిల్యూర్‌తో జయంత్ కెరీర్‌కు దాదాపుగా ఎండ్ కార్డ్ పడిపోయిందని చెప్పాలి.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు