హరీష్ శంకర్-వంశీ పైడిపల్లి-నందినిరెడ్డిల కలయికలో!

  • December 13, 2017 / 03:36 PM IST

ఈ శనివారం (డిసెంబర్ 15) నుంచి హైద్రాబాద్ లో మొదలవ్వనున్న తెలుగు మహాసభల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న విషయం తెలిసిందే. అందుకోసం తెలంగాణ రీజియన్ కి చెందిన దర్శకులను ఏకం చేసి ఓ స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేయించింది. తెలంగాణ స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, నందినిరెడ్డిలు కలిసి ఒక స్పెషల్ సాంగ్ ను డైరెక్ట్ చేశారు. ఈ సాంగ్ లో తెలంగాణ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, మెహరీన్, ఈషా, హెబ్బా పటేల్, దక్ష తదితరులు ఆడిపాడనున్నారు. నిన్నమొన్నటివరకూ విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో “సీక్రెట్ ప్రొజెక్ట్” అంటూ హడావుడి చేసింది ఈ స్పెషల్ సాంగ్ ను ఇకపై తెలంగాణలో మాత్రమే కాక తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ థియేటర్లలో ప్లే చేయనున్నారట.

గవర్నమెంట్ యాడ్ కాబట్టి అన్నీ థియేటర్స్ లో ప్లే అవ్వాల్సిన అవసరమే. సో ఈ తెలుగు మహాసభల పుణ్యమా అని పైన పేర్కొన్న హీరోహీరోయిన్స్ అందరూ జనాల కళ్ళల్లో నాలుగు కాలాలపాటు నానడం గ్యారెంటీ. ఇకపోతే.. ఈ ప్రొజెక్ట్ కోసం కలిసిన హరీష్ శంకర్-వెంశీ పైడిపల్లి-నందినిరెడ్డిలు మళ్ళీ మరో సినిమా కోసం కలిసి వర్క్ చేస్తే ఈ పాట కంటే అద్భుతమైన ప్రొజెక్ట్ బయటకి రావడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus