తనను మోసం చేసి పెళ్లి చేసుకొందని ఆరోపిస్తున్న హీరో

పెళ్లి మీద పెళ్లి చేసుకుంటున్న హాలీవుడ్ నటుడు నికోలాస్ కేజ్ నాలుగో పెళ్లి కూడా పెటాకులైంది. పెళ్లి జరిగిన వారం రోజుల లోపే విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన నాలుగో భార్య ధీటుగా ఎదురించి నికోలాస్‌పై దావా వేసింది. దాంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్‌లో నికోలాస్ తీరు చర్చకు దారి తీసింది. నటుడు నికోలాస్ కేజ్ వివాహం ఎరికా కోయికేతో లాస్ ఎంజెలెస్‌లో మార్చి 23న జరిగింది. పెళ్లి తర్వాత 4వ రోజునే విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. తమ వివాహం ఓ ఫ్రాడ్ అని నికోలాస్ ఆరోపించారు. తనను తప్పుదోవ పట్టించి వివాహం జరిగేలా చేశారని విమర్శలు చేశాడు. తాను, ఎరికా మద్యం మత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయిం తీసుకొన్నామని ఆరోపించారు. దాంతో ఎరికాతో విభేదాలు తలెత్తాయి. పెళ్లి తర్వాత విభేదాలు నెలకొనడంతో నికోలాస్‌కు సర్ధి చెప్పడానికి ప్రయత్నించాను. కానీ అతను తన మాటను పెడచెవిన పెట్టాడు.

అతని చేష్టలు అర్ధం కాకుండా ఉన్నాయి. తాను ఓ ట్రాన్స్‌లో ఉన్నట్టు కనిపించింది. తాను ఎన్నిమార్లు సర్ది చెప్పినా వినకుండా కోర్టులో విడాకుల కోసం కేసు నమోదు చేశాడు అని ఎరికా వెల్లడించింది. నికోలాస్‌ కేజ్‌తో సర్దుకుపోవాలని ప్రయత్నించాను. కానీ వైవాహిక జీవితానికి తాము సరిపోమని తెలుసుకొన్నాను. అయితే నాకు జీవనభృతిని కల్పించేలా కోర్టు ద్వారా చర్యలు తీసుకొంటున్నాను. కేజ్‌తో పెళ్లి వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను. ఆయన ఆరోపణలతో నా ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది. నాకు జీవనభృతిని కల్పిస్తే విడాకులు ఇవ్వడానికి సిద్ధం అని ఎరికా ఆవేదన వ్యక్తం చేశారు. హాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు ఉన్న నికోలాస్ కేజ్‌కు గతంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. అలైస్ కిమ్, లిసా మారి పెర్ల్సీ, పాట్రిసియా అర్‌క్వెట్టే‌ను వివాహం చేసుకొన్నాడు. తాజాగా మేకప్ ఆర్టిస్టు ఎరికా కోయికాతో 2018 ఏప్రిల్ నుంచి డేటింగ్ చేస్తూ 2019 మార్చి 23న వివాహం చేసుకొన్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus