థియేటర్లలో రావడానికి ఇబ్బంది పడిన చిత్రాలు

ఒక సినిమా రూపుదిద్దుకోవడానికి ఎంతోమంది శ్రమించాలి. ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అంత కస్టపడి ఫస్ట్ కాపీ సిద్ధమయినా.. అది ప్రేక్షకుడిని చేరడానికి మరో యుద్ధం చేసినట్లే. అలా సినిమా పూర్తిగా రెడీ అయినా థియేటర్లోకి రావడానికి ఆలస్యమయిన కొన్ని తెలుగు చిత్రాలపై ఫోకస్…

అఖిల్అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటించిన అఖిల్ మూవీని ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా డల్ గా ఉందని కింగ్ నాగార్జున రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు. కొన్ని సీన్లను రీ షూట్ చేయించి విడుదల చేశారు.

ఢమరుకంస్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఢమరుకం సినిమాను ఆర్ధిక ఇబ్బందులు ముప్పు తిప్పలు పెట్టాయి. చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్న ఈ మూవీ విడుదలవ్వడానికి కూడా మూడు నెలలు టైమ్ తీసుకుంది.

కిక్ 2మాస్ మహారాజ్ రవితేజ మూవీ కిక్ 2 కి రిలీజ్ గండం ఆరు నెలలు పట్టుకుంది. ఈ కాలంలో ఎన్ని సార్లు థియేటర్లలోకి రావాలని ప్రయత్నించినా వీలు కుదరలేదు. చివరికి 2015 ఆగస్టు లో కిక్ 2 రిలీజ్ అయింది.

ఎటాక్మంచు మనోజ్, జగపతి బాబులతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ మూవీకి కూడా రిలీజ్ కష్టాలు తప్పలేదు. అనేక సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేశారు. ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది.

రాజాది రాజాశర్వానంద్ ఏకకాలంలో తెలుగు, తమిళ్ భాషల్లో చేసిన చిత్రం రాజాది రాజా. తమిళంలో థియేటర్లో రిలీజ్ చేయడానికి అడ్డంకులు ఎదురుకావడంతో నేరుగా ఆన్ లైన్లో విడుదల చేశారు. తమిళ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన ఏడాది తర్వాత తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగి పోయింది.

కొరియర్ బాయ్ కళ్యాణ్గత ఏడాది సెప్టెంబర్లో విడుదలైన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా వాస్తవానికి రెండేళ్ల క్రితమే రిలీజ్ కావాలి. నితిన్, యామి గౌతమ్ జంటగా నటించిన ఈ మూవీ ఆలస్యానికి కారణం ఆర్ధిక సమస్యలేనని సమాచారం.

రేయ్మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రేయ్ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం కావాల్సింది. మూవీని కంప్లీట్ చేసినా ఆర్ధిక ఇబ్బందుల వల్ల రెండేళ్ల పాటు గదుల్లోనే ఉండిపోయింది. దీనికంటే ముందే తేజు నటించిన రెండో చిత్రం “పిల్లా నువ్వు లేని జీవితం” విడుదలై ఇదే తొలి చిత్రం గా ముద్ర వేసుకుంది.

జెండాపై కపిరాజునేచురల్ స్టార్ నాని చేసిన ద్వి భాష చిత్రం “జెండా పై కపిరాజు”. ఈ చిత్రం రెండేళ్ల పాటు కష్టాలు పడి గత ఏడాది థియేటర్లోకి వచ్చింది.

వెన్నెల్లో హాయ్ హాయ్క్లాసిక్ చిత్రాలను డైరక్ట్ చేసిన వంశీ మెగా ఫోన్ నుంచి వచ్చిన 25 వ చిత్రం “వెన్నెల్లో హాయ్ హాయ్”. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటిని ఈ మూవీ అధిగమించడానికి మూడేళ్లు పట్టింది.

శంకరమౌన గురు అనే తమిళ సినిమాను తెలుగులో శంకర గా రీమేక్ చేశారు. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ చిత్రం 2013 లోనే కంప్లీట్ అయింది. ఎన్నో సమస్యల వల్ల మూడేళ్లపాటు ల్యాబ్ కే పరిమితమయింది. గత నెల విడుదలైన శంకర ఆకట్టుకోలేక పోయింది.

సాహసమే శ్వాసగా సాగిపోయువ సామ్రాట్ నాగ చైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో చేసిన రెండో మూవీ సాహసమే శ్వాసగా సాగిపో గత ఏడాదే కంప్లీట్ అయింది. అయితే తమిళ వెర్షన్ తీసే సమయంలో తలెత్తిన ఆర్ధిక సమస్యల వల్ల ఈ మూవీ 8 నెలలు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus