Animal: యానిమల్ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

రణ్ బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ నెల 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. యానిమల్ హిందీ టీజర్ కు 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇతర భాషల్లో కూడా ఈ టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరనే ప్రశ్నకు మహేష్ బాబు పేరు సమాధానంగా వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. గతంలో కూడా మహేష్ బాబు కథ అద్భుతంగా ఉన్నా తనకు నచ్చని రోల్స్ ను రిజెక్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. యానిమల్ సినిమా తనకు సూట్ అయ్యే మూవీ కాదని మహేష్ బాబు ముందుగానే ఊహించారని తెలుస్తోంది. ఈ రీజన్ వల్లే మహేష్ ఈ సినిమాకు నో చెప్పినట్టు భోగట్టా.

యానిమల్ (Animal) సినిమాను కూడా సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో తెరకెక్కించాడని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. యానిమల్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సందీప్ రెడ్డి ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా తర్వాత సినిమా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది. స్పిరిట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సందీప్ రెడ్డి వంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus