‘పింక్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని ప్రకటన చేసినప్పుడు చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ చెయ్యడం .. అది హిట్ అవ్వడం జరిగింది. హీరోయిజం ఏమాత్రం లేని ఈ స్క్రిప్ట్ ను పవన్ ఇమేజ్ కు తగినట్లు చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను జోడించారు. అలాగే ఆయన పొలిటికల్ ఇమేజ్ ను మరియు నిజ జీవితంలో ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తుచేస్తూ చాలా డైలాగులు యాడ్ చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ తో ఈ రీమేక్ చెయ్యాలి అనే ఆలోచన మొదట దిల్ రాజుకి లేదట. ఇందులో హీరోయిజాన్ని జోడిస్తే థీమ్ మొత్తం పక్కదారి పడుతుంది అనే ఉద్దేశంతో సీనియర్ హీరోలతో చేస్తే బెటర్ అని ఆయన భావించారట. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణను కూడా సంప్రదించారట దిల్ రాజు. అయితే ఆయన నుండీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదని టాక్. బహుశా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఈ కథని చేస్తే ఆయన అభిమానులు అంగీకరించరు అని భావించి దీనిని పక్కన పెట్టి ఉంటాడు అని కొందరి అంచనా..!
ఇకపోతే బాలయ్య కాదన్న తరువాత.. కచ్చితంగా ఈ రీమేక్ ను నాగార్జునతో చేస్తే బెటర్ అనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చాడట. అక్కడ అమితాబ్ చేసిన పాత్రకు నూటికి నూరు శాతం నాగార్జున అయితే న్యాయం చేయగలరు అని దిల్ రాజు భావించారట.కానీ ఇంతలో త్రివిక్రమ్ గారిని కలవడం.. ‘పింక్’ రీమేక్ గురించి డిస్కషన్ రావడం.. వెంటనే త్రివిక్రమ్ దానిని పవన్ కళ్యాణ్ కు చేరవేయడం జరిగిందట. ఇక మిగిలిన కథ అంతా దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినదే..!
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!