Star Hero: పవన్‌ డైరక్టర్‌ కోసం స్టార్‌ హీరో డేర్‌ స్టెప్‌… ఎంత ఇంప్రెస్‌ అవ్వకపోతే చేస్తాడు?

  • August 22, 2023 / 03:40 PM IST

క్రాఫ్‌, లుక్‌, డ్రెస్సింగ్‌… ఈ మూడు సినిమా హీరోలకు చాలా అవసరం అంటుంటారు. సరైన లుక్‌ పడితేనే సినిమా ఆడుతుంది కాబట్టి. ఇలాంటి ఆలోచనలు ఉన్న ఈ రోజుల్లో ఓ హీరో గుండు కొట్టుకున్నాడు అంటే నమ్ముతారా? అందులోనూ ఓ బాలీవుడ్‌ హీరో చేశాడు అంటే ఇంకా నమ్ముతారా? కానీ చేశాడు, చేసి చూపించాడు. ఆ గుండు ధైర్యం ఉన్న హీరోనే సల్మాన్‌ ఖాన్‌. అవును బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ కొత్త లుక్‌ బయటకు వచ్చింది. నున్నటి గుండుతో సల్మాన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల ఒక ఈవెంట్‌కు హాజరైన (Star Hero) సల్మాన్ ఖాన్‌ను చూసి విచ్చేసిన అతిథులే కాదు, ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. కారణం సల్మాన్‌ గుండుతో కనిపించడం. సల్లూ భాయ్‌ ఉన్నట్టుండి జుట్టు మొత్తం ఎందుకు తీయించేశాడు అనే సందేహం చాలామందికి వచ్చింది. ఎందుకా అని ఎంక్వైరీ చేస్తే.. కొత్త సినిమా కోసమే ఈ గెటప్ అంటున్నారు. కరణ్ జోహార్ నిర్మించబోయే భారీ యాక్షన్ సినిమా కోసం సల్మాన్ తన అవతారాన్ని పూర్తిగా మార్చుకున్నాడని తెలిసింది. ఆ సినిమా దర్శకుడు మనకు బాగా తెలిసినవాడే.

పవన్ కల్యాణ్‌ను నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో చూపించిన విష్ణు వర్ధన్‌ గుర్తున్నారా? అదేనండీ ‘పంజా’ విష్ణు వర్ధన్‌. ఇప్పుడు ఆయనతో సల్మాన్‌ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం ఫుల్‌ మేకోవర్‌ అవుతాడు అని సల్మాన్‌ గురించి వార్తలు వచ్చినా.. మరీ ఇంతలా ‘గుండు’ ధైర్యం చూపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అక్కడ ఉన్నది సల్మాన్‌ ఏదైనా చేయగలడు. అందులోనూ బాలీవుడ్‌ను రీ కన్‌స్ట్రక్షన్‌ చేసే పనిలో ఉన్నారు కూడా. దీంతోనే ఈ ధైర్యం చేశాడు అని చెబుతున్నారు.

మొన్నటికి మొన్న ‘జవాన్‌’ కోసం షారుఖ్‌ ఖాన్‌ గుండు కొట్టగా… ఇప్పుడు ఆయన స్నేహితుడు సల్మాన్‌ ఈ పని చేశాడు. ఇంకా ఎంతమంది ఇలా ఆలోచిస్తారో చూడాలి. అన్నట్లు ఇది విష్ణు వర్ధన్‌ తొలి బాలీవుడ్‌ సినిమా అనుకునేరు. ఆయన గతేడాది సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ – కియారా అడ్వాణీతో ‘షేర్‌షా’ అనే సినిమా చేసి మంచి హిట్‌ కొట్టారు. ఆ లెక్కన ఇది రెండో సినిమా. అయితే వెండితెరపై తొలి సినిమానే. ఎందుకంటే ‘షేర్‌షా’ ఓటీటీల్లోకి డైరెక్ట్‌గా వచ్చింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus