కీర్తి వెంటపడుతోన్న స్టార్ హీరో!

తెలుగులో ‘నేను.. శైలజ’ సినిమాతో హిట్ కొట్టిన మలయాళం బ్యూటీ కీర్తి సురేష్ కు ఆ సినిమా తరువాత తిరుగులేకుండా పోయింది. తమిళంలో కూడా ఈ భామ నటించిన సినిమాలు వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో అక్కడ కూడా ఈ అమ్మడుకి మంచి అవకాశాలే తలుపు తట్టాయి.

స్టార్ హీరో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలానే విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న 60వ సినిమాలో కూడా నటించే అవకాశం ఈమెనే వరించింది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి కాలేజ్ కి వెళ్ళే పాత్ర.

అదే కాలేజ్ లో చదువుతోన్న కీర్తి సురేష్ ను ప్రేమలో దింపడానికి ఆమె వెంటపడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ సన్నివేశాలను చెన్నైలో వేసిన ఓ కాలేజ్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు భరత్. ఈ సినిమా గనుక హిట్ అయితే కీర్తి తమిళంలో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus