సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలు మీడియా ముందు చెప్పడానికి ఇష్టపడరు. ఇక తమ ఫ్యామిలీని అయితే సాధ్యమైనంత వరకు మీడియాకి దూరంగా ఉంచడమే పనిగా పెట్టుకుంటారు. అయితే కొంతమంది మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరివరకో ఎందుకు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీయ తన భర్త ఆండీని పబ్లిక్ గా లిప్ లాక్ లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ స్టార్ హీరో కూడా చేరాడు.
పెళ్లి రోజు నాడు పురస్కరించుకుని ఏకంగా తన భార్యని పబ్లిక్ లో లిప్ లాక్ పెట్టుకుని.. ఆ సందర్భంలో తీసుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ ఫోటోని షాహిద్ కపూర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘చుక్కలతో నిండిన ఆకాశంలో.. నా హృదయాన్ని నీకు ఇచ్చాను.! ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో నా భార్యతో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
తమ 8 వ పెళ్లి రోజు నాడు తన (Star Hero) భార్య మీరా కపూర్ కు ఇలా ప్రేమతో విషెస్ చెప్పడం బాగానే ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది షాహిద్ కపూర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ‘పబ్లిక్ లో ఏంటీ చెండాలం’ అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.