తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణాల సంఖ్య పెరిగింది. దీంతో రిలీజ్ డేట్స్ కోసం పోటీ పెరిగింది. పండుగ, వేసవి సీజన్స్ లో స్టార్ హీరోల చిత్రాలు సిద్ధంగా ఉంటాయి. అందుకే అన్ సీజన్ లో డేట్స్ కి గిరాకీ ఏర్పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ డేట్స్ ఫిక్స్ చేశారు. రవితేజ కూడా టచ్ లో ఉన్నాడు. పెద్ద పండుగకి బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు.. ఆ వారంలో మరో రెండు చిన్న సినిమాలు కూడా రానున్నాయి. ఇక సంక్రాంతి వేడి తగ్గగానే రిపబ్లిక్ డే సెలవులను ఉపయోగించుకోవడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. జనవరి 26 న ఐదు సినిమాలు రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి.
అనుష్క “భాగమతి”తో పాటు “ఆచారి అమెరికా యాత్ర”.. “మనసుకు నచ్చింది”.. “విశ్వరూపం-2 “.. “అభిమన్యుడు” చిత్రాలు థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇందుకే ఆశ్చర్యపోతుంటే ఫిబ్రవరి 9వ తేదీకి మంచి గిరాకీ ఏర్పడింది. వరుణ్ తేజ్ సినిమా “తొలి ప్రేమ”, బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ “సాక్ష్యం”, నిఖిల్ చిత్రం “కిరాక్ పార్టీ”, మోహన్ బాబు సినిమా “గాయత్రి” రానున్నాయి. ఒకే రోజు మూడు సినిమాలు వస్తేనే కలక్షన్లపై భారీ ప్రభావం కనిపిస్తుంది. థియేటర్ల కొరత వెక్కిరిస్తూనే ఉంటుంది. మరి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.