‘మీటూ’ ఉద్యమంలో ఇదో కొత్త పేజీ.. అంత ధైర్యం ఉంటే కొట్టేవాడినంటూ..!

హీరోయిన్ల కష్టాల గురించి టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. నిజానికి టాలీవుడ్‌లోనే కాదు, మొత్తం దేశంలోని సినిమా పరిశ్రమలో ఈ ఇబ్బంది ఉంది. దీని గురించి కొన్నేళ్ల క్రితమే ‘మీ టూ’ అంటూ తమ కష్టాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రపంచ సినిమా పరిశ్రమలో మహిళల ఇబ్బందులు, పడ్డ కష్టాలు తెలిశాయి. ఆ మీటూ ఉద్యమంలో కొత్త పేజీ బయటకు వచ్చింది. సినిమా పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, చేదు అనుభవాల గురించి చెప్పారు.

Avika Gor

ఈ క్రమంలో కథానాయిక అవికా గోర్‌ (Avika Gor) చెప్పిన విషయం వాటన్నింటికి కంటే భిన్నం. అంతేకాదు ఇలాంటివి తొలిసారి తెలియడం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమెను కాపాడాల్సిన బాడీగార్డే ఆమెను వేధించాడు. ఈ విషయాన్ని అవికానే చెప్పుకొచ్చింది. ‘బాలికా వధు’ / ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్‌తో బాల నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది అవికా గోర్‌. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ (Uyyala Jampala) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా విజయం సాధించిన తర్వాత స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు అన్ని విజయాలు రాలేదు. దీంతో ఇంకా స్టార్‌ హీరోయిన్‌ అయ్యే పనిలోనే ఉంది. ఈ క్రమంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయింది. తన రక్షణ కోసం నియమించుకున్న బాడీ గార్డ్‌ తనను లైంగికంగా వేధించడాని అవికా గోర్‌ తెలిపింది.

గతంలో ఓ బాడీ గార్డును నియమించుకున్నానని, కానీ అతను తనను అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఓ ఈవెంట్లో అసభ్యకరంగా తాకగా.. అతడి వైపు సీరియస్‌గా చూసి ఏంటి అని అడగ్గా.. వెంటనే సారీ చెప్పాడని తెలిపింది. కానీ తర్వాత కూడా అలాగే ప్రవర్తించాడు. ఆ సమయంలో కొట్టే ధైర్యం లేక వదిలేశాను అని అవిక చెప్పింది. ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉందని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే కచ్చితంగా కొడతా అని కూడా చెప్పింది అవికా గోర్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus