నా వల్లే ఆ హీరోయిన్ సెటిలైపోయింది : నిత్య మీనన్

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది నిత్యామీనన్. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం పాటలు కూడా పడటం ఈ అమ్మడి టాలెంట్. ‘అలామొదలైంది’ సినిమా సూపర్ హిట్టయిన తరువాత ఈ బ్యూటీ కి ఇక్కడ చాలా ఆఫర్లు వచ్చాయి. అయినా తన పాత్రకి ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి డైరెక్టర్ కి అయినా నో చెప్పి పంపించేస్తుంది. ‘మొండిగటం’ అని కూడా నిత్యా సన్నిహిత వర్గం చెబుతుంటారు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఓ చిత్రానికి నో చెప్పడం వల్ల.. మరో హీరోయిన్ పెళ్ళైపోయిందట. అదేంటి విడ్డూరంగా ఉంది అనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే.. ఆర్య, నయనతార జంటగా నటించిన ‘రాజా రాణి’ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించిన నజ్రియా నజీమ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె మలయాళం ‘బెంగుళూరు డేస్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడే.. హీరో ఫహద్ ఫజిల్ తో ప్రేమాయణం నడపడం తరువాత వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా నిత్యా మీనన్ ను అడిగారట. అయితే మరో చిత్రం చేస్తూ బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను నిత్యా రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఏదేమైనా నిత్యా రిజెక్ట్ చేయడంతో నజ్రియా కు హీరోయిన్ గా అవకాశం రావడం.. అదే హీరోని ఆమె పెళ్ళి చేసుకుని సెటిలైపోవడం జరిగిపోయింది. ఈ విషయం స్వయంగా నిత్యా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘నా వల్లే వారిద్దరి పెళ్ళి జరిగిందని నజ్రియా ఎక్కడ కలిసినా ఈ విషయాన్నీ గుర్తు చేస్తుందని’ అంటూ నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus