తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి, ఆ తర్వాత వచ్చిన ప్రతీ అవకాశం ని సద్వినియోగ పరుచుకుంటూ మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా జీవిత ప్రయాణం ప్రతీ ఒక్కరికి ఒక దిక్సూచి. కెరీర్ ప్రారంభం లో కృషి, పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సూత్రానికి పర్యాయపదం లాగ నిల్చిన మెగాస్టార్ , 7 పదుల వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా చెరగని ఉత్సాహం, అదే కసి, అదే పట్టుదల నేటి తరం యువ హీరోలకు కూడా ఆదర్శప్రాయం గా నిలిచే రేంజ్ లో నిలబడ్డాడు.
ఇప్పటికీ ఆయన బాక్స్ ఆఫీస్ పరంగా నేటి తరం స్టార్ హీరోలతో ఏ విధంగా కలబడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం, అది మెగాస్టార్ అంటే. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో చిరంజీవి కి కొంతమంది నిర్మాతలు రెమ్యూనరేషన్స్ కి ఛాన్స్ దొరికితే ఎగ్గొట్టేవారట. చిరంజీవి అలాంటి వారిని ఇబ్బంది పెట్టకుండా చూసి చూడనట్టుగా ఉండేవాడట కానీ,
కెరీర్ ప్రారంభం లో సినిమానే నమ్ముకొని వచ్చిన (Chiranjeevi) చిరంజీవి కి డబ్బులు ఎగ్గొట్టినప్పుడు మాత్రం చాలా అవస్థలు పడాల్సి వచ్చేది అట. ఉదాహరణకి ఆయన అప్పట్లో ఒక తమిళ సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. అప్పటికీ చిరంజీవి హీరో అవ్వలేదు, కేవలం క్యారక్టర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చేవాడు. అయితే నెల రోజులు చిరంజీవి తో షూటింగ్ చేయించుకొని,
చేతిలో ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం తో రూమ్ రెంట్ కట్టుకోలేక, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక, చాలా ఇబ్బందికి గురి అయ్యాడట. అప్పుడు తన స్నేహితులను మొహమాటం తో డబ్బులు అడిగితే వాళ్ళు చేసిన సహాయం తోనే రూమ్ రెంట్ కట్టుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!