Samantha: హీరోయిన్ స్థాయి నుంచి సమంత పడిపోయింది!

నటి సమంత తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే సినిమా విడుదలకు రెండు రోజులు సమయం ఉందనగా సమంత తనకు అనారోగ్యంగా ఉందని ఎలాగైనా సినిమాని సక్సెస్ చేయాలనీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సమంత  (Samantha) ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించారు. అయితే తాజాగా నటి సమంత పై నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.సమంత విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేశారు. అయితే బతుకుతెరువు కోసం వచ్చిన అవకాశాలను ఆమె అందుకుంటున్నారు.ఇక హీరోయిన్ గా ఆమె కెరియర్ ముగిసిపోయిందని గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళుతుందని చిట్టిబాబు తెలిపారు.

ఆమెకు ముందులాగా మరోసారి స్టార్ డమ్ రాదని తెలిపారు. సమంత యశోద సినిమా విడుదల సమయంలో కూడా ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు.ప్రతిసారి ఇలాంటి సెంటిమెంట్లు వర్కౌట్ కావని ఈ డ్రామాలు ఎందుకు చేయాలి అంటూ ఆయన ప్రశ్నించారు.సినిమాని సక్సెస్ చేయడం కోసమే సమంత ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తుందని అయితే ప్రతిసారి తన ప్లాన్స్ వర్కౌట్ కావని తెలిపారు.

ఇలా హీరోయిన్స్ స్థాయి నుంచి కిందికి పడిపోయినటువంటి సమంత శాకుంతలం సినిమాకు ఎలా సెట్ అయింది అనేది తనకు అర్థం కాని ప్రశ్న అని తెలిపారు.ఈ సినిమా పై నాకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదని ఈ సందర్భంగా సమంత గురించి నిర్మాత చిట్టిబాబు చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus