రెమ్యూనరేషన్లపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ కామెంట్స్‌ వైరల్‌!

బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితి చూశారో, లేక చాలా ఏళ్లుగా చూస్తున్నారనో కానీ.. ఈ మధ్య కాలంలో ప్రముఖ బాలీవుడ్‌ దర్శనిర్మాత మాటల్లో చాలా తేడా వచ్చింది. సౌత్‌ సినిమాలు, హీరోల ఆలోచనలు.. ఇక్కడి కాంబినేషన్లపై తరచుగా ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. హిందీ సినిమాల్లో ఇలాంటి పరిస్థితి కొరవడటం వల్లే ఇలా బాలీవుడ్‌ ఇబ్బంది పడుతోంది అని కూడా అంటున్నారు. తాజాగా హీరోల రెమ్యూనరేషన్ల విషయంలో కరణ్‌ జోహార్‌ కామెంట్స్‌ చేశారు. దాంతోపాటు ఆయన సరదాగా అన్న కొన్ని మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

సినిమా అనేది ఓ ఎమోషన్‌. నా మనసు ఎప్పుడూ హిందీ చిత్రాలపైనే ఉంటుంది అని చెప్పిన కరణ్‌ జోహార్‌… ఓ వ్యాపారవేత్తగా చెప్పాల్సి వస్తే మాత్రం టాలీవుడ్‌ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మ ప్రొడక్షన్స్‌.. ఇద్దరు వ్యక్తులతో స్టార్టప్‌లా మొదలైంది అంటూ తన తొలి రోజుల్ని గుర్తు చేసుకున్న కరణ్‌.. యశ్‌ చోప్రా మాటల్ని కూడా ప్రస్తావించారు. సినిమా ఫలితాన్ని బడ్జెట్‌ నిర్ణయిస్తుంది అని గతంలో యశ్‌ చోప్రా అన్నట్లు కరణ్‌ తెలిపారు.

ఇక ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా గురించి చెబుతూ.. అలియా భట్‌, వరుణ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రతో వచ్చిన ఆ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్నా ఆర్థికంగా నష్టపోయాను అని వివరించారు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాల నిర్మాణంలో ఎక్కువ డబ్బు.. రెమ్యునరేషన్‌ రూపంలో స్టార్‌లకే వెళ్తోంది అని తన మనసులో మాట చెప్పుకొచ్చారు. దాంతోపాటు ‘ఇలా చెబుతున్నందుకు నన్ను మర్డర్‌ చేస్తారేమో’ అంటూ జోకేశారు.

అయితే ఆ జోక్‌ వెనుక ఏముంది అనేదే ఇప్పుడు చర్చ. ఓ సినిమాతో తొలి రోజు రూ.5 కోట్ల వసూళ్లు రాబట్టలేని వారు కూడా రూ.20 కోట్లు పారితోషికం అడగడం సరైన పనేనా.. అంటూ బాలీవుడ్‌ పరిస్థితి గురించి మాట్లాడారు కరణ్‌. అయితే ఆయనకు చెప్పని విషయం ఏంటంటే.. సౌత్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus