SSMB29: రాజమౌళితో సినిమా అంటే అంతే మరి..!

రాజ‌మౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో కచ్చితంగా ఓ సినిమా రావాల్సి ఉంది. ఎందుకంటే ‘పోకిరి’ ‘విక్రమార్కుడు’ టైంలో వీళ్ళు నిర్మాత కె.ఎల్.నారాయణ్ వద్ద వీళ్ళు అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 15 ఏళ్ళు దాటింది. కానీ ఇంకా ప్రాజెక్టు మొదలుకాలేదు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాజమౌళి.. మహేష్ తోనే సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసేశాడు. కాకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల రాజమౌళి ఇమేజ్ ఇంకా పెరిగింది. ఆ సినిమాకి ఆస్కార్ రావడం, జపాన్ లో రూ.100 కోట్లు పైనే వసూల్ చేయడంతో రాజమౌళి సినిమా అంటే ఇంటర్నేషనల్ మర్కెట్స్ ను టార్గెట్ చేస్తూ చేయాలి అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

అయితే (SSMB29) మహేష్ తో రాజమౌళి సినిమా అంటే కనీసం రూ.800 కోట్లు బడ్జెట్ పెట్టాలి అని అంతా అంటున్నారు. సెట్స్ పైకి వెళ్ళాక అది రూ.1000 కోట్ల వరకు కూడా వెళ్లొచ్చు. ఎంత బడ్జెట్ పెట్టినా.. రాజ‌మౌళి దానిని వెనక్కి రాబట్టుకోగలడు. అందులో డౌట్ లేదు. కానీ రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ పెట్టె కెపాసిటీ కె.ఎల్.నారాయణకి లేదు.

అందుకే ఆర్కా మీడియా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రంలో నిర్మాణ భాగ‌స్వాములుగా చేరబోతున్నట్టు సమాచారం. 2024 స్టార్టింగ్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. డిసెంబర్ కి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈలోపు మహేష్ – త్రివిక్రమ్ ల సినిమా రిలీజ్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus