గ్లామర్‌ ఇండస్ట్రీలో మరో విడాకులు.. ఈసారి ఎవరంటే?

మరో సెలబ్రిటీ కపుల్‌ వివాహ బంధానికి తెరపడింది. 12 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ప్రముఖ పాప్‌ సింగర్‌ షకీరా, బార్సిలోనా ఫుల్‌ బాల్‌ ఆటగడు గెరార్డ్‌ పికూ విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరూ కలసి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అయితే దీని వెనుక పెద్ద కథే నడించింది అని అంతర్జాతీయ మీడియా వార్తలు రాస్తోంది. ముందుగా ప్రకటనలో ఏముందో చూసి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

‘‘మేం విడిపోతున్నామని చెప్పడానికి బాధపడుతున్నాం. అయితే మా పిల్లల కోసం మా వ్యక్తిగత ప్రైవసీ గౌరవిస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ షకీరా, గెరార్డ్ తమ ప్రకనటలో పేర్కొన్నారు. 45 ఏళ్ల షకీరా, 35 ఏళ్ల గెరార్డ్‌ల రిలేషన్‌కి గుర్తుగా సాషా, మిలన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2010 ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌కు కొన్ని రోజుల ముందు షకీరా, గెరార్డ్‌ కలిశారు. ఆ వరల్డ్ కప్ కోసం షకీరా రూపొందించిన ‘వాకా వాకా’ సాంగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అప్పటి పరిచయం ఏడాది అయ్యాక ప్రేమగా మారింది.

12 ఏళ్లుగా అంతా బాగానే ఉన్న వారి బంధంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. కొన్ని రోజుల క్రితం మరో మహిళతో గెరార్డ్ ఉండగా. షకీరాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడట. దీనిపై ఎవరూ ఎక్కడా అధికారికంగా మాట్లాడకున్నా… స్పెయిన్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో పెద్ద దుమారమే రేగింది. గెరార్డ్ లేట్ నైట్ వరకూ పార్టీలు చేసుకుంటూ, వేరే మహిళలతో చనువుగా ఉంటున్నాడని స్పెయిన్‌ మీడియా రాసుకొచ్చింది.

ఇప్పుడు గెరార్డ్‌, షకీరా విడిపోతున్నట్టు ప్రకటన రావడం గమనార్హం. మీడియాలో వచ్చిన వార్తలకు, షకీరా – గెరార్డ్‌ల బ్రేకప్‌ వార్తలకు సంబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. ఇదిలా ఉండగా షకీరా మీద ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసు ఒకటి ఉంది. స్పెయిన్ కోర్టులో ఆమెపై ఫ్రాడ్ కేసు విచారణ దశలో ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus