అమ్మతనం కి మించిన ఆస్తి లేదు అని ఆడవాళ్లు భావిస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు దానికి నోచుకోక బాధపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాగే ఒకరు లేక ఇద్దరు అనే పద్దతిని ఫాలో అయ్యి పిల్లల్ని కనేవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందే ఉన్నారు. కానీ కొంతమంది లేటు వయసులో కూడా తల్లి అవ్వడం అనేది అరుదుగా వింటుంటాం. ‘బాధాయ్ హో’ సినిమా వంటి వాటిల్లో చూశాం. సరిగ్గా అలాంటి సీన్ ఇప్పుడు ఇంకోటి రిపీట్ అయ్యింది అని చెప్పాలి.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత అయిన సిద్దు మూసే వాలా రెండేళ్ల క్రితం గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో మరణించిన సంగతి చాలా మందికి తెలుసు.సిద్దూ మృతికి ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయిపోయిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు దూరం అవ్వడంతో సిద్దూ తల్లిదండ్రులు నరకం అనుభవించారు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు వారి ఫ్యామిలిలో ఆనంద వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే.. సిద్దూ తల్లి చరణ్ కౌర్ గర్భం దాల్చారట.
చరణ్ కౌర్ కి (Charan Kaur) ఇప్పుడు 58 ఏళ్లు కాగా, తండ్రి బాల్ కౌర్ సింగ్ వయస్సు 60 ఏళ్లు కావడం గమనార్హం. వృద్ధాప్యంలో తోడు కోసం, కొడుకు జ్ఞాపకాల కోసం వృద్ధాప్యంలో కూడా ఈ జంట బిడ్డను కనాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సిద్దూ తల్లి గర్భం దాల్చినట్టు తెలుస్తుంది. చరణ్ కౌర్ సోదరుడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. మార్చి నెలలో డెలివరీ ఉంటుందని కూడా ఆయన తెలిపారు.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!