Pushpa2: అలా చేస్తే చరణ్, తారక్ ఫ్యాన్స్ ఒప్పుకోరుగా!

సినిమా రంగంలో ఎంత గొప్పవాళ్లు అయినా ఒదిగి ఉంటే మాత్రమే వాళ్ల కెరీర్ కు ప్లస్ అవుతుందనే సంగతి తెలిసిందే. ఏదైనా సినిమా నచ్చకపోయినా సినీ రంగానికి చెందిన వాళ్లు విమర్శలు చేస్తే ఆ విమర్శల ప్రభావం వాళ్లపై కచ్చితంగా పడుతుంది. కావాలని ఇతరులు హర్ట్ అయ్యేలా సినీ ప్రముఖులు విమర్శలు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రముఖ సౌండ్ ఇంజనీర్ రసూల్ పొకుట్టి ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ ఓటీటీ సంస్థల సీఈవోలు ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసిస్తుంటే రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు మాత్రం సినిమాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను చూసి తట్టుకోలేక ఆ సినిమా గురించి ఆ సినిమాలో నటించిన హీరోల గురించి రసూల్ పొకుట్టి అసభ్యంగా కామెంట్లు చేశాడని ఇండస్ట్రీ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు చేసే విమర్శల వల్ల మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

పుష్ప ది రైజ్ సినిమాకు రసూల్ పని చేయగా పుష్ప2 సినిమాకు రసూల్ ను తీసుకోవద్దని చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు. ఒకవేళ రసూల్ పొకుట్టిని పుష్ప2 సినిమాకు కూడా కొనసాగిస్తే మాత్రం ఆ సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రాజమౌళి రెమ్యునరేషన్ తో ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ ను పూర్తి చేయవచ్చు.

రాజమౌళిపై ప్రత్యక్షంగా విమర్శలు చేసే ఛాన్స్ లేకపోవడంతో రసూల్ పొకుట్టి లాంటి వాళ్లు సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. రసూల్ పొకుట్టికి తెలుగులో కొత్తగా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus