ఆలస్యమే అమృతం అంటున్న స్టార్ హీరోలు

ఎప్పుడు వచ్చామన్నది కాదు.. హిట్ కొట్టామా? లేదా..! అనేది నేటి కథానాయకుల మంత్రం అయింది. హడావుడిగా సినిమాలు చేసి అపజయాలను చూడడం కన్నా వినూత్నమైన కథతో రావడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా కథ, క్యారక్టర్ కోసం ఎక్కువసమయం వెచ్చిస్తున్న హీరోలపై ఫోకస్…

రవితేజమంచి ఫామ్లో ఉన్నప్పటికీ రవితేజ బెంగాల్ టైగర్ సినిమా తరువాత మూవీ ఓకే చేయడానికి ఏడాది సమయం తీసుకున్నారు. ‘టచ్ చేసి చూడు’ అంటూ ఎనర్జటిక్ కథతో పాటు రాజా ది గ్రేట్ అంటూ తాను ఇది వరకు పోషించని అంధుడి పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

అల్లు అర్జున్ గతేడాది ఏప్రిల్ 22 న అల్లు అర్జున్ సరైనోడు రిలీజ్ అయింది. వందకోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆరు నెలలో బన్నీ మరో సినిమాను రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు. కథ చర్చలకు ఆరు నెలలు పట్టింది. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ చేస్తున్న ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ ప్రొడక్షన్ దశలో ఉంది. రిలీజ్ కావడానికి మరో రెండు నెలలు పడుతుంది.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ కథ కోసం ఆరునెలలు సమయం తీసుకున్నారు. స్టోరీ ఓకే చేసిన తర్వాత క్యారక్టర్ కోసం మరో మూడు నెలలు కసరత్తు చేశారు. జై లవ కుశ గా మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించేందుకు కష్టపడుతున్నారు. ఈ మూవీ ఎప్పటికి పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేము.

అఖిల్ అక్కినేని ప్రిన్స్ అఖిల్ అయితే మొదటి సినిమా ప్లాప్ కావడంతో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. రెండేళ్లు గ్యాప్ తీసుకొని విక్రమ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఇది విభిన్నమైన ప్రేమకథ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

రామ్ గతఏడాది ప్రారంభంలో నేను శైలజ తో హిట్ అందుకున్న రామ్ .. వేగంగా హైపర్ ని పూర్తి చేశారు. సెప్టెంబర్ లో విడుదలయిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అదే స్పీడ్ తో మరో మూని మొదలుపెడుతాడుకుంటే.. కొత్తగా కనిపించాలని సిక్స్ ప్యాక్ రప్పించి, గడ్డం పెంచి నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తన కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ తో హిట్ ట్రాక్ లోకి వచ్చినా వెంటనే నెక్స్ట్ ప్రాజక్ట్ పట్టాలెక్కించలేదు. సుకుమార్ చెప్పిన కథను మెచ్చి, 1980 నాటి పరిస్థితులకు అనుగుణంగా బాడీని మార్చుకున్నారు. చెవిటి వాడిగా హీరోయిజం చూపించడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus