బాహుబలి 2 గురించి స్టార్స్ ఏమన్నారంటే ?

  • April 28, 2017 / 10:32 AM IST

బాహుబలి కంక్లూజన్ ఈ రోజు రిలీజ్ అయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రభాస్ అభిమానులతో పాటు ఈ సినిమాను చూసేందుకు స్టార్స్ సైతం ఉత్సాహం చూపించారు. చూసిన వెంటనే తమ అనుభూతిని మీడియాతో పంచుకున్నారు.

బలమైన కథ కథనం

బలమైన కథా కథనాలతో బాహుబలిని రాజమౌళి ఆద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రతి పాత్రను ప్రత్యేకంగా మలిచి తెరపై గొప్పగా ఆవిష్కరించాడు. అంతర్జాతీయస్థాయి దర్శకుడు ఇండియాలో ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. – కృష్ణం రాజు

హ్యాట్సాఫ్

బాహుబలి కంక్లూజన్ తో కేవలం తెలుగు సినిమానే కాదు భారతీయ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. హ్యాట్సాఫ్ రాజమౌళి. – ఎన్టీఆర్

ఇదొక వేడుక

బాహుబలి అనేది సినిమా కాదు. ఒక వేడుక. మేమంతా గర్వపడేలా చేసిన బాహుబలి టీమ్ కి ధన్యవాదాలు. – నాని

అసలైన హీరోలు మీరే

బాహుబలి వంటి గొప్ప కథను వెండి తెరపై ఆవిష్కరించడానికి శోభు, ప్రసాద్ గార్ల ప్రోత్సాహం విలువకట్టలేనిది. వారే రియల్ హీరోలు. – అఖిల్ అక్కినేని

పదాలు దొరకడం లేదు

బాహుబలి ఎలా ఉందొ చెప్పడానికి డిక్షనరీలో పదాలు దొరకడం లేదు. రాజమౌళి సృజన అద్భుతం.
– కోన వెంకట్

సెల్యూట్

సినీగురు రాజమౌళి నాకు తెలుసు అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. అద్భుత చిత్రాన్ని ఇచ్చిన బాహుబలి టీమ్ కి సెల్యూట్. – జగపతి బాబు

శుభాకాంక్షలుబాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకంటే.. బాహుబలి సినిమాని ఇంత బాగా రాజమౌళి ఎలా తీయగలిగారు ? అని అడగాలనిపిస్తుంది. ప్రభాస్ తన పాత్రకి వందశాతం న్యాయం చేశారు. విజయం సాధించినందుకు బాహుబలి బృందానికి శుభాకాంక్షలు. – కళ్యాణ్ రామ్

కష్టం కనిపిస్తుంది

బాహుబలి సినిమాకోసం రాజమౌళి టీమ్ ఐదేళ్లు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. భారతీయ సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి థాంక్స్. – రకుల్ ప్రీత్ సింగ్

మంచి రిపోర్ట్స్

బాహుబలి 2 గురించి అన్ని వైపులా నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకే నా హాలీడే ట్రిప్ ని తొందరగా ముగించి బాహుబలిని చూడాలని అనుకుంటున్నాను. కంగ్రాట్స్ రాజమౌళి, ప్రభాస్ టీమ్.
– కొరటాల శివ

మీ విజన్ విద్యార్థిగా చేసింది

థియేటర్ లోకి డైరక్టర్ గా అడుగుపెట్టాను. బాహుబలి కంక్లూజన్ సినిమా చూసి బయటికి నేను అప్రెంటీస్ గా వచ్చాను. మీ విజన్ నేను ఇంకా విద్యార్థిననే విషయాన్ని గుర్తు చేసింది. రాజమౌళి గారు హ్యాట్సాఫ్ – సుకుమార్

సాహో రాజమౌళి

గొప్ప, బలమైన వ్యక్తులకు, అద్భుత భావోద్వేగాలకు మాహిష్మతి రాజ్యం నిలయమని వెండితెరపై చూపించిన విధానం సూపర్. సాహో రాజమౌళి. భారతీయ సినిమాకి మంచి గుర్తింపు కలిగించే సినిమాని నిర్మించిన శోభు, ప్రసాద్ లకు జయహో. – క్రిష్


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus