సంక్రాంతికి రెస్ట్.. ఆ తర్వాత నో రెస్ట్

పెద్ద పండుగ సంక్రాంతిని తెలుగువారందరూ సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు వెళుతారు. మరి సినిమావాళ్లు.. వాళ్లు కూడా పండుగను ఎంజాయ్ చేస్తారు. షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ హంగామా చేస్తారు. అలా పండుగకు ఎన్నిరోజులు స్టార్స్ బ్రేక్ ఇచ్చారో చూద్దాం.

హ్యాపీ సంక్రాంతి ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి యువ డైరక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా రీసెంట్ గా తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ను పొలాచ్చిలో మొదలు పెట్టనున్నారు. సో ‘సైరా’ చిత్ర బృందానికీ హ్యాపీ సంక్రాంతి.

టు డేస్.. నో మోర్ హాలిడేస్ కంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో అక్కినేని నాగార్జునతో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలెట్టారు. ఈ చిత్ర యూనిట్ కి రెండు రోజులే సెలవు ఇచ్చారు. ఆ రెండు రోజుల్లో పండుగను జరుపుకొని నాగ్ షూటింగ్ కి హాజరుకానున్నారు.

నాన్‌స్టాప్‌ షూట్‌“గురు” సినిమా తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నారు వెంకటేష్. అందుకే ఈ సంక్రాంతికి రెస్ట్ తీసుకొని తర్వాత నాన్ స్టాప్ గా తేజ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తరవాత త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడిలతోను ఇదే జోరు కొనసాగించనున్నారు.

బ్యాక్‌ టు బ్యాక్‌ బ్రేక్‌మొన్ననే క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకున్న మహేష్ మళ్ళీ బ్రేక్ తీసుకోనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న భరత్ అను నేను కొత్త షెడ్యూల్ షూటింగ్ సోమవారం (8వ తేదీ) ప్రారంభమయింది. ఈ షూటింగ్‌ కు 13న ప్యాకప్‌ చెప్పనున్నారు. పండుగ తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ చేయనున్నారు.

సెలవులో కూడా పనే ఎన్టీఆర్‌ జై లవ కుశ తరవాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమాని మొదలెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కనిపించడానికి శ్రమిస్తున్నారు. పండగని కుటుంబసభ్యులతో ఆనందిస్తూనే పిండి వంటలకు దూరంగా ఉండనున్నారు. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టనున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగనున్నారు.

ఇంటి వద్దే చెర్రీ కొన్ని రోజులుగా రామ్ చరణ్ తన రంగస్థలం సినిమా కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన గ్రామీణ సెట్ లో సాగుతోంది. ఈ షెడ్యూల్ 12వ తేదీ న ముగించనున్నట్లు తెలిసింది. పండుగను ఇంటి వద్దే జరుపుకొని రాజమండ్రిలో స్టార్టయ్యే కొత్త షెడ్యూల్‌ కి చెర్రీ ప్రిపేర్ కానున్నారు.

బ్రేక్ లేకుంటే ఎలా ?అల్లు అర్జున్ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. పండుగ ముందు రోజు వరకు షూటింగ్ జరుగుతుందంట. ఆ తర్వాత బ్రేక్‌ తీసుకుంటారని తెలిసింది.

మూడు రోజులు సెలవు బ్రేక్‌“టచ్‌ చేసి చూడు” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన రవితేజ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో సినిమాని మొదలెట్టారు. ఈ షూటింగ్ ని శనివారం వరకు జరిపి ఆ తరవాత యూనిట్ మొత్తం మూడు రోజులు సెలవు తీసుకోనుంది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోతారు.

యుద్ధం ఆపి పండుగ వరుసగా విజయాలు రావడంతో నాని ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా చకచకా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని “కృష్ణార్జున యుద్ధం” చేస్తున్నారు. సంక్రాంతి పండక్కి రెండు రోజులు సెలవు తీసుకొని మళ్లీ షూట్‌లో జాయిన్‌ అవుతారు.

ఫస్ట్‌ ఫెస్టివల్‌… లాంగ్‌ బ్రేక్‌నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తున్న తొలి పండుగ సంక్రాంతి. సో ఈ పండుకకు ఎక్కువరోజులు సెలవు తీసుకోబోతున్నారు. 11, 12తేదీల వరకూ సవ్యసాచి సెట్స్‌లోనే చైతూ ఉండనున్నారు. ఆ తర్వాత నెలాఖరు వరకు బ్రేక్ తీసుకోనున్నారు. ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో మళ్లీ షెడ్యూల్‌ మొదలవుతుంది.

టెన్షన్ లేకుండా ఎంజాయ్వరుణ్‌ తేజ్‌ “తొలి ప్రేమ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. పండగకి ముందే ఈ పాట పూర్తయిపోతుంది. దీంతో సినిమా కూడా కంప్లీట్‌ అయిపోతుంది. సో.. పండగను ఏ టెన్షన్ లేకుండా వరుణ్ జరుపుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus