2017 లో విడుదల కావాల్సిన సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అలా అని అది చిన్న సినిమా కాదు. మన గోపీచంద్ నటించినదే. ‘ఆరడుగుల బుల్లెట్’ అని..! ఈ సినిమాని చాలా వరకు జనాలు మర్చిపోయారు. కానీ గతేడాది కరోనా కరోణంగా ఓటిటిల హవా పెరగడంతో.. ఈ మూవీని ఓటిటిలో రిలీజ్ చేయమని ఆఫర్లు వచ్చాయి.మంచి రేటే చెప్పారు.కానీ ఈ మూవీ అధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. దీనికి సంబంధించిన కేసు క్లియర్ అవ్వలేదు. వాటన్నిటినీ నిర్మాతలు క్లియర్ చేసుకుని వచ్చేసరికి ఓటిటి సంస్థలు సైడ్ అయిపోయాయి.
దాంతో నిర్మాతలు పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు లా అయిపోయింది. పోనీ థియేట్రికల్ రిలీజ్ చేసుకుంటే కొంతలో కొంత రికవర్ అయ్యి.. మళ్ళీ ఓటిటి సంస్థలు ముందుకు వస్తాయి అనుకుంటే.. ఈ సినిమాకి రూ.4 కోట్లకు మించి బిజినెస్ అవ్వడం లేదు. ఆగష్ట్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు.కానీ వాళ్ళు రూ.8 కోట్ల బిజినెస్ ఆశిస్తే.. రూ.4 కోట్లకు మాత్రమే జరుగుతుంది. పైగా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమా కూడా రూ.10 కోట్లు వసూల్ చేయలేదు. దాంతో బయ్యర్లు అంత పెట్టలేము అంటున్నారని వినికిడి.
అయితే గోపీచంద్ నటించిన ‘సీటీమార్’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఇదే ఊపులో ‘ఆరడుగుల బుల్లెట్’ ను అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నట్టు ఆ చిత్రం నిర్మాతలు ఓ ప్రకటన ఇచ్చారు. కానీ ఇన్సైడ్ టాక్ ఏంటంటే.. వాళ్లకు థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచన లేదట. మంచి రేటు వస్తే ఓటిటికి అమ్మేయాలన్నది వాళ్ళ ప్లాన్. అందుకోసమే ‘సీటీమార్’ క్రేజ్ ను వాడుకుంటున్నారని టాక్. పాపం వాళ్ళ తిప్పలు అన్నీ ఇన్నీ కావు..!