ఇక లావణ్య కోలుకోవడం కష్టమే

తెలుగులో క్రేజ్ వున్న కథానాయికలలో లావణ్య త్రిపాఠి ఒకరు. ‘అందాల రాక్షసి’తో తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి, ఆ తరువాత ‘భలే భలే మగాడివోయ్’తో భారీ హిట్ కొట్టేసింది. ఆ వెంటనే ‘సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు’ హిట్స్ తో తన క్రేజ్ ను మరింతగా పెంచేసుకుంది. మిగతా కథానాయికలకు లావణ్య త్రిపాఠి గట్టి పోటీ ఇస్తుందని ఈ సమయంలోనే అంతా అనుకున్నారు. కానీ కొంతకాలంగా ఆమె వరుస పరాజయాలతో సతమతమైపోతోంది. వరుణ్ తేజ్ తో చేసిన ‘మిస్టర్’, నాగచైతన్యతో చేసిన ‘యుద్ధం శరణం’, శర్వానంద్ తో చేసిన ‘రాధా’, రామ్ తో చేసిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు వరుసబెట్టి ఫ్లాప్ అయ్యాయి. తాజాగా సాయిధరమ్ తేజ్ తో జోడీకట్టిన ‘ఇంటిలిజెంట్’ కూడా తీవ్ర నిరాశపరిచింది.

ఈ సినిమాలో అందాలను ఆరబోసినా ఫలితం లేకపోవడంతో, లావణ్య డీలాపడిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా “చమక్ చమక్” సాంగ్ లో ఈజ్ తో డ్యాన్స్ చేద్దామని ప్రయత్నించి నీరసంగా కనిపించిన లావణ్యను చూసి నీరసపడుతున్నారు ప్రేక్షకులు. అలాంటి అద్భుతమైన పాటలో ఏదో ఇష్టం లేనట్టు ఆ డ్యాన్సులు ఏమిటి అని మెగా అభిమానులు సీరియస్ అయ్యారు. దాంతో హిట్ కొట్టలేకపోయాననే బాధకంటే ప్రేక్షకులు తన డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ ను విమర్శిస్తున్నారనే బాధ లావణ్య త్రిపాఠిని తొలిచేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus