‘జై బాలయ్య’పై దర్శకుడు ఇలా….

  • February 16, 2016 / 10:43 AM IST

హను రాఘవపూడి దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కృష్ణగాడి గాడి వీర ప్రేమ గాధ’. ఇక ఇందులో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నాని బాలయ్య అభిమాని అని, అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది అని దర్శకుడు ఇప్పటికే తెలిపాడు. మరో పక్క నానీతో సినిమా చెయ్యడానికి దాదాపుగా 3-4కధలు చెప్పాను అని, అందాల రాక్షసి కధ చెప్పినప్పుడు నిర్మొహమాటంగా నచ్చలేదు అని చెప్పిన నాని. ఆతరువాత రెండు, మూడు కధలను కూడా తిరస్కరించాడు అని, అనుకోని క్రమంలో ఈ కధ చెప్పినప్పుడు కధ నచ్చి మరీ బాగా డెవెలప్ చెయ్యి, చేద్దాం అన్నాడు, ఇక అప్పటి నుంచి ఎప్పటికప్పుడు సినిమా గురించి అప్‌డేట్స్ ఇస్తూ వచ్చానని దర్శకుడు తెలిపాడు. ఇక నాని చేతిపై జై బాలయ్య టాటు కధ గురించి సైతం దర్శకుడు వివరించాడు. అనంతపురంలో సాగే ఈ కధలో బాలయ్య అభిమానిగా నటిస్తున్న నానీ, చేతిపై ‘జై బాలయ్య’ అనే టాటు ఉంటుంది అని, అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో ఒక కుర్రాడు ఆ టాటును ఫోటో తీసి ఆన్‌లైన్ లో పెట్టాడని, ఇక అప్పటినుంచీ అందరూ సినిమా పేరు ‘జై బాలయ్య’ అని అనుకుంటున్నట్లు తెలిపాడు. తాము సినిమా టైటిల్ ను ‘జై బాలయ్య’ అని అనుకోలేదని చెప్పాడు. ఏది ఏమైనా…జై బాలయ్య అన్న ఒక్క మాటతో, ఈ సినిమా రేంజ్ పెరిగిపోయింది అని చెప్పాడు దర్శకుడు. ఈ సినిమా అంచనాలను ఆదుకుంటుంది అని ఆశిద్దాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus