కాబోయే భర్తతో విడిపోయిన త్రిష…కారణం అదే..!

అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ అయిన త్రిష.. మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ లతో నటించేసింది. అప్పట్లో వరుస ప్రాజెక్ట్ లతో ఈమె బిజీగా ఉండేది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈమెకు ఆఫర్లు తగ్గడంతో తమిళ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఈమెకు పెద్ద ఎత్తున ఆఫర్లు అయితే రావడం లేదు కానీ.. కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.

స్టార్ హీరోయిన్ కాబట్టి.. ఈమె పై రూమర్లు మాత్రం మొదటి నుండీ ఎక్కువే. తాజాగా ఈమె కాబోయే భర్తతో విడిపోయినట్టు సమాచారం. ఆది కూడా తమిళ స్టార్ హీరో ధనుష్ వల్లే అనేది పెద్ద ట్విస్ట్. వివరాల్లోకి వెళితే… వరుణ్ మణియన్ అనే చెన్నై కు చెందిన బిజినెస్ మెన్ తో త్రిష ఎంగేజ్మెంట్ 2015 లో జరిగింది. అయితే అది పెళ్ళి వరకూ వెళ్ళలేదు. వీరిద్దరూ విడిపోయారు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనికి ప్రధాన కారణం … పెళ్ళైన తర్వాత త్రిష సినిమాల్లో నటించకూడదు అని వరుణ్ .. త్రిష తో ముందే చెప్పాడట. అంటే కాదు త్రిష … ధనుష్ కు మంచి ఫ్రెండ్. అయితే అతనికి, వరుణ్ కు మధ్య గొడవలు ఉన్నాయట. దీంతో అతన్ని ఎంగేజ్మెంట్ కు, పెళ్ళి కి పిలవొద్దు.. అని ముందుగానే త్రిషకు చెప్పాడట వరుణ్. అయినప్పటికీ త్రిష ఎంగేజ్మెంట్ లో ధనుష్ కనిపించాడట. దీంతో గొడవ పెద్దది అవ్వడం … వాళ్ళు విడిపోవడం జరిగాయని తెలుస్తుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus