తమన్నాపై షూ విసిరిన యువకుడు

  • January 28, 2018 / 11:56 AM IST

పాపం ఒక్కోసారి ఈ హీరోయిన్ల జీవితాలు చూస్తుంటే జాలేస్తుంటుంది. అందలం ఎక్కామనుకొనేలోపే పాతాళానికి లాగేస్తుంటారు కొందరు. మేకప్ వేసుకొని స్టార్ డమ్ అందుకోవడానికి వారు ప్రయత్నిస్తుంటే.. ఇంకొందరు వారిపై బురద జల్లే పనిలో ఉంటారు. “బాహుబలి” లాంటి హిస్టారికల్ హిట్ మూవీలో నటించి స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పేరు తెచ్చుకొన్న తమన్నాకు నేడు హైద్రాబాద్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది. నారాయణగుడాలోని మలబార్ గోల్డ్ కొత్త బ్రాంచ్ ను ఓపెన్ చేయడానికి వెళ్ళిన తమన్నాపై ఓ ముస్లిం యువకుడు షూ విసిరాడు.

అది తమన్నాకు గట్టిగా తగలకపోయినా, షూ డైరెక్ట్ గా ఆమె మీద పడేసరికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది తమన్నా. వెంటనే సర్ధుకుని షాప్ ప్రారంభోత్సవం కానిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.  తీరా ఆ షూ విసిరిన కుర్రాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అతడి పేరు కరీముద్దీన్ అని, అతడు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడని తెలిసింది. కాకపోతే.. షూ ఎందుకు విసిరాడు అనే విషయం మీద ఆ కుర్రాడికి కూడా క్లారిటీ లేదు. మరి సరదాగా షోరూం ఓపెనింగ్ కోసం వచ్చిన తమన్నాపై షూ విసిరిన ఆ కుర్రాడికి కలిగే పైశాచికానందం ఏమిటో?!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus