టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరికి వారు తమ తమ ఇమేజ్ తో దూసుకు పోతున్నారు. అయితే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పోలిస్తే ఎన్టీఆర్ కి ఇతర బాషల్లో కాస్త మార్కెట్ తక్కువ అన్న గాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు ఎన్టీఆర్ ఒక్కడే అన్న విషయాన్ని స్పష్టంగా తెలిపాయి. మిగిలిన హీరోలందరూ తమిళం, కన్నడ, మళయాళం అన్న బాషల మార్కెట్ కోసం పాట్లు పడుతుంటే ఏకంగా ఎన్టీఆర్ దేశాలు దాటి జపాన్ వరకు వెళ్ళిపోయాడు. ఆయన క్రేజ్ దేశాలు దాటి ఇప్పటికే జపాన్ వరకు పాకింది.
విషయంలోకి వెళితే…తారక్ సినిమాలకు ఇటీవల జపాన్‌లో విపరీతమైన క్రేజ్ వస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమా కూడా అక్కడ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వేసి ఫాలో పాలో యు స్టెప్‌ను అక్కడ జపాన్ అభిమానులు వేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే అదే క్రమంలో… ఇటీవల జపాన్‌కు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని హైదరాబాద్‌కు వచ్చి మరీ తారక్‌ను గ్యారేజ్ షూటింగ్‌లో కలిసి వెళ్ళడం, ఆగస్టు 12న వస్తున్న జనతా గ్యారేజ్ సినిమాను అదే డేట్‌కు తమ జపాన్‌లో కూడా రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చెయ్యడం చూస్తుంటే, ఎన్టీఆర్ కు జపాన్ లో ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్ధం అయిపోతుంది.
ఇక మరో పక్క జపాన్‌లో ఇప్పటి వరకు ఇండియా హీరోలలో ఒక్క సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు మాత్రమే సూపర్ క్రేజ్ ఉంది. దీంతో రజినీకాంత్ తరువాత అక్కడ పాపులారిటీ దక్కించుకున్న రెండో సౌత్ ఇండియన్ హీరోగా మారాడు ఎన్టీఆర్. టాలీవుడ్ నుంచి అయితే ఎన్టీఆర్ ఒక్కడే అన్న మాట బలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా…తారక్ టాప్ హీరో అనడంలో ఏమాత్రం సందేహం లేదు.