బన్నీ ఒక్క అడుగేస్తే వర్కౌట్ అయ్యిపోద్ది..!

కెరీర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ పేరు చాలా సార్లు చెప్పి మెగా అభిమానులకి మరింత దగ్గరయ్యాడు అల్లు అర్జున్. ‘హ్యాపీ’ ‘పరుగు’ ‘జులాయి’ వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ పేరుని పలు సన్నివేసాల్లో పలు మార్లు వాడి ‘మా బన్నీ… మన బన్నీ’ అనే రేంజ్లో మెగా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే ‘సరైనోడు’ సక్సెస్ మీట్ సమయంలో పవన్ గురించి మాట్లాడమంటే… ‘చెప్పను బ్రదర్’ అని బన్నీ అనేసరికి పవన్ ఫ్యాన్స్ కు శత్రువైపోయాడు. అప్పటి నుండీ బన్నీ ఎక్కడ ఏం మాట్లాడిన… ఓ రేంజ్లో ట్రోల్ల్స్ చేస్తున్నారు. అయితే తరువాత మళ్ళీ అలా అనడానికి కారణం చెప్పినా… పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడినా పవన్ ఫ్యాన్స్ మాత్రం కరగడం లేదు.

‘నువ్వు ఎదిగే వరకూ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని… ఓ నాలుగు హిట్లు అందుకునే సరికి పవన్ పేరు నీకు భారంగా మారిందా’… అంటూ ఇప్పటికీ బన్నీని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక బన్నీ సినిమా టీజర్లకు కూడా యూట్యూబ్ లో డిస్లైకులు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బన్నీ… జనసేన పార్టీ తరుపున ప్రచారానికి వస్తాడని టాక్ నడుస్తుంది. బన్నీతో పాటూ వరుణ్ కూడా ప్రచారానికి రాబోతున్నాడని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే పవన్ ఫ్యాన్స్ లో బన్నీ పై ఉన్న నెగిటివ్ అభిప్రాయం కూడా తగ్గే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. ఈ రకంగా చూసుకుంటే ‘జనసేన’ బన్నీకి పెద్ద ఆయుధమనే చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుందో చూద్దాం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus