టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నిర్మాణంలో రూపొందిన ‘శుభం’ (Subham) సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకుంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సమంత కి అత్యంత సన్నిహితుడు అయిన రాజ్ అండ్ డీకే టీం ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. హారర్ కామెడీ జోనర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 9న విడుదల చేశారు. గవిరెడ్డి శ్రీనివాస రావు వంటి వారు మెయిన్ రోల్స్ చేశారు.
మొదటి షోతో పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే వీక్ డేస్ లో తడబడింది. రెండో వీకెండ్ కు కొత్త సినిమాలు ఏవీ లేవు. ఈ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.81 cr |
సీడెడ్ | 0.22 cr |
ఉత్తరాంధ్ర | 0.93 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.96 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
ఓవర్సీస్ | 0.52 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.73 cr (షేర్) |
‘శుభం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.73 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. గ్రాస్ పరంగా రూ.4.53 కోట్లు కలెక్ట్ చేసింది.