మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్..లు హీరోలుగా ‘భైరవం’ (Bhairavam) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మే 30న విడుదల కానుంది ఈ సినిమా. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు కాగా కెకె రాధామోహన్ నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ని వదిలారు.
ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 54 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ముగ్గురు హీరోలైన మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్..లు పలుకగా.. విలన్స్ ఎంట్రీ అయ్యారు.
కృష్ణుడు గీతలో చెప్పిన ఆ వాక్యాలను ఉద్దేశిస్తూ.. ధర్మాన్ని కాపాడటానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అంటూ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న జయసుధ చెప్పడం జరిగింది. ఒక ఊర్లో గుడి. అందులోని నగలపై కన్నేసిన కొంతమంది విలన్లు. ఆ ఊరిని కాపాడే హీరోలు వాళ్ళను అడ్డుకోవడం. వాళ్ళని కండబలంతో గెలవలేని విలన్లు.. వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం. అది ఎలా? చివరికి ఏం జరిగింది? ఈ సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.
ట్రైలర్ నిండా యాక్షన్ సీన్లే ఉన్నాయి. కంటెంట్ గురించి కొంతవరకు మాత్రమే హింట్ ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :