Bigg Boss 7 Telugu: సీక్రెట్ రూమ్ లో ఉన్నది ఎవరు..? శుభశ్రీ అవుట్..! బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ కంటెండర్స్ కోసం ఆడిన టాస్క్ లో హౌస్ మేట్స్ అలియాస్ బడ్డీస్ చేసిన మిస్టేక్స్ ని చెప్తూ వారికి వీరలెవల్లో క్లాస్ పీకాడు కింగ్ నాగార్జున. హౌస్ట్ గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూనే ఎవరు ఫౌల్ గేమ్ ఆడారు అనేది చాలా వివరంగా చెప్పాడు. ముఖ్యంగా సందీప్ – అమర్ దీప్ ఇద్దరికీ వీరలెవల్లో క్లాస్ పడింది. ఇక అమర్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. అలాగే, సందీప్ కూడా సార్ ముందు ఏమీ మాట్లాడలేకపోయాడు.

శోభా శెట్టి డెసీషన్ వల్ల ప్రియాంకకి జరిగిన అన్యాయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ ప్లయిన్ చేశారు హోస్ట్ నాగార్జున. అయితే, ఈవారం ఎలిమినేషన్ లోనే చాలా ట్విస్ట్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. నిజానికి శనివారం ఎపిసోడ్ జరుగుతుండగానే ఆదివారం ఎపిసోడ్ గురించిన ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే, ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.ఓ అంటూ రీ లాంఛ్ చేస్తూ ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారు.

వీళ్లతో పాటుగా సెలబ్రిటీలు సైతం స్టేజ్ పైన సందడి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే శుభశ్రీ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అలాగే, ఈవారం ఒకరిని ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నారు. అందులో ముందుగా అమర్ పేరు వినిపించింది.

ఆ తర్వాత గౌతమ్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టినట్లుగా చెప్పారు. తర్వాత శివాజీ పేరు కూడా వినిపించింది. అలా నామినేషన్స్ లో ఉన్న అందరి పేర్లు దాదాపుగా వినిపించాయి. అయితే, పైనల్ గా సీక్రెట్ రూమ్ లోకి ప్రియాంక జైన్ ని పంపించినట్లుగా తెలుస్తోంది. ప్రియాంక జైన్, టేస్టీ తేజ, శుభశ్రీ ఈ ముగ్గురు కూడ డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఫస్ట్ నుంచీ సస్పెన్స్ గానే ఉంది.

అయితే బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం శుభశ్రీ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రియాంకని సైతం ఎలిమినేట్ చేసి డబుల్ ఎలిమినషన్ గా ప్రకటించి సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నారనేది టాక్. మరి ఈవారం ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అంతేకాదు, కొత్త కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తూ సీజన్ 7ని సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. అదీ మేటర్.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus