ఈ సంవత్సరంలో తెలుగు హీరోయిన్స్ జయాపజయాలు

కాలం గిర్రున తిరిగింది. కొన్ని రోజుల్లో 2017 కి గుడ్ బై చెప్పనున్నాం. కెరీర్ సమయం తక్కువ కలిగిన కథానాయికలకు ఈ ఒక్క సంవత్సరమే ఎన్నో సినిమాలు అందించడానికి ఉపయోగపడుతుంది. కెరీర్ ని డిసైడ్ చేస్తుంది. మరి ఈ సంవత్సరం మన తెలుగు టాప్ టెన్ హీరోయిన్స్ కి ఎన్ని విజయాలను అపజయాలను ఇచ్చిందో తెలుసుకుందాం.

అనుష్క టాలీవుడ్ స్వీటీ హీరోయిన్ అనుష్క నటించిన “బాహుబలి కంక్లూజన్” ఈ ఏడాది రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ సాధించింది. దేవసేనగా అనుష్క దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దర్శకదీరుడు రాఘవేంద్రరావు, నాగార్జున కలయికలో వచ్చిన “ఓం నమో వేంకటేశాయ”లో కృష్ణమ్మగా ఆకట్టుకుంది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ 2017లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన “విన్నర్‌”, “రారండోయ్‌ వేడుక చూద్దాం’”, “జయ జానకీ నాయక”, “స్పైడర్‌”, “ఖాకి”.. చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’లో భ్రమరాంబ గా రకుల్‌ అదరగొట్టింది. అయితే ఎక్కువ హిట్స్ అందుకోలేకపోయింది.

తమన్నా ఈ సంవత్సరం తమన్నా “బాహుబలి 2 “లో మాత్రమే కనిపించింది. అది కూడా కొన్ని క్షణాలు మాత్రమే. ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ‘జై లవకుశ’లో “స్వింగు జర..” పాటతో యువతని మెప్పించింది.

కాజల్‌ టాలీవుడ్ క్వీన్ కాజల్ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది. ఆమె నటించిన “ఖైదీ నెం.150 ” సూపర్ హిట్ అయింది. అలాగే రానాతో చేసిన “నేనే రాజు నేనే మంత్రి”తో మరో హిట్ సొంతం చేసుకుంది.

శ్రుతిహాసన్‌ ఈ ఏడాది శ్రుతిహాసన్‌ చేసిన ఒకే ఒక సినిమా “కాటమరాయుడు”. పవన్‌ కల్యాణ్‌తో చేసిన ఈ మూవీ నిరాశపరిచింది.

సమంత క్యూట్ బ్యూటీ సమంత ఈ ఏడాది దెయ్యంగా భయపెట్టింది. ఆత్మగా ఆమె నటించిన “రాజు గారి గది” నటిగా మీకు సంతృప్తిని ఇచ్చింది. తమిళం లో ఆమె చేసిన మెర్సిల్ తెలుగులో “అదిరింది” గా రిలీజ్ అయి విజయాన్ని సాధించింది.

రాశీఖన్నా రాశీఖన్నా ఈ సంవత్సరం స్టార్ హీరోలతో కలిసి వచ్చింది. ఎన్టీఆర్‌తో కలసి ఆమె నటించిన “జై లవకుశ” సూపర్ హిట్ అయింది. గోపీచంద్‌ తో చేసిన “ఆక్సిజన్‌” ఫ్లాప్ అయింది. “రాజా ది గ్రేట్‌”లో కాసేపు కనిపించి ఆకట్టుకుంది.

శ్రియ బాలకృష్ణతో ఈ ఏడాది శ్రీయ రెండు సినిమాలు చేసింది. “గౌతమిపుత్ర శాతకర్ణి” లో పిల్లల తల్లిగా నటించి శెభాష్ అనిపించుకుంది. పైసా వసూల్‌లోను మాస్‌ ప్రేక్షకులను మెప్పించింది.

లావణ్య త్రిపాఠి ఈ ఏడాది లావణ్య త్రిపాఠి రాధ, మిస్టర్‌, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ…నాలుగు సినిమాలు చేసింది. అయినా ఏదీ సరైన హిట్ ఇవ్వలేకపోయింది.

రెజీనా రెజీనా కి కూడా ఈ సంవత్సరం కలిసి రాలేదు. తెలుగులో నక్షత్రం, నగరం, బాలకృష్ణుడు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక్కటికూడా విజయ తీరం చేరలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus