విజయానికి కొత్త.. పాత అని తేడా లేదు. సీనియర్.. జూనియర్ అనే బేధం లేదు. కష్టపడ్డ వాడికి విజయలక్ష్మి వరిస్తుంది. ఇందుకు సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. అయితే ఇక్కడ కష్టంతో పాటు క్రియేటివిటీ అవసరం. కష్టానికి క్రియేటివిటీ జోడిస్తే హిట్ అందుకుంటారు. కొన్నేళ్లుగా శ్రమించి .. స్టార్ డైరక్టర్స్ గా పేరు తెచ్చుకున్న వారికి ఈ సంవత్సరం ఎన్ని విజయాలను ఇచ్చిందో .. తెలుసుకుందాం.
ఎస్.ఎస్.రాజమౌళితనను నమ్మి ఐదేళ్లు కేటాయించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కి బాహుబలి కంక్లూజన్ అద్భుత విజయాన్ని ఇచ్చింది. కలక్షన్స్ తో పాటు అవార్డుల వర్షం కురిపించింది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరును కొనసాగిచ్చింది.
వి వి వినాయక్అఖిల్ మూవీతో అపజయం.. అపవాదు మూటగట్టుకున్న వివి వినాయక్ కి ఈ సంవత్సరం మంచి కానుకని అందించింది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 రూపంలో హిట్ వరించింది.
క్రిష్విలక్షమైన కథలతో ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటూ వస్తున్న క్రిష్.. ఈ ఏడాది అదే బాటలో నడిచారు. గౌతమీపుత్ర శాతకర్ణి తో ఇది వరకటి కంటే ఘనవిజయాన్ని అందుకున్నారు.
పూరి జగన్నాథ్డేరింగ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ ఏడాది ఇషాన్ తో రోగ్, బాలకృష్ణ తో పైసావసూల్ తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు రిలీజ్ కి ముందు ఉన్న క్రేజ్.. రిలీజ్ అయినా తర్వాత లేదు.
హరీష్ శంకర్గబ్బర్ సింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో డీజే (దువ్వాడ జగన్నాథమ్) చేశారు. ఇది వందకోట్ల క్లబ్ లో చేరి చిత్ర బృందానికి ఆనందాన్ని పంచింది.
బోయపాటి శ్రీనుస్టార్ హీరోలు క్యూలో ఉన్నప్పటికీ బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనుతో జయ జానకి నాయక చిత్రం చేశారు. విజయానికి, అపజయానికి మధ్య ఊగిసలాడారు.
ఎ.ఆర్.మురుగదాస్‌తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ రూపొందించారు. ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
బాబీపవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న బాబీ ఈ ఏడాది ఎన్టీఆర్ తో జై లవకుశ తెరకెక్కించారు. తారక్ లోని నటనను మూడు పాత్రలతో వెలికితీయించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.
మారుతిచిన్న కథలతో బిగ్ హిట్ అందుకునే మారుతి.. ఈ ఏడాది కూడా శుభ్రమైన విజయాన్ని కైవశం చేసుకున్నారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ అందరినీ నవ్వించి.. హిట్ జాబితాలో చేరింది.
కె. రాఘవేంద్రరావుచాలా కాలం తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఓం నమో వేంకటేశాయ అనే భక్తి కథ చిత్రాన్ని తీశారు. ఇది ఘోర పరాజయం పాలైంది.
వంశీగోదావరి తీరం కథలతో క్లాసిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న వంశీ.. ఈ సారి ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాని తీశారు. హిట్ కొట్టలేకపోయారు.
కృష్ణవంశీక్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీకి ఈ ఏడాది కూడా విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సంవత్సరం అతను నక్షత్రం సినిమాని తీసుకొచ్చారు. విజయాన్ని తీసుకెళ్లలేకపోయారు.
ఇలా విజయం ఒకరి సొత్తుకానట్టు.. కొందరికి అరచేతిలో చిక్కింది. మరికొందరికి చిక్కినట్టే చిక్కి చేయి జారీ పోయింది.